షర్మిళ సోషల్ వార్...ప్రభాస్‌తో సంబంధం అంటూ...

YS Sharmila
x
YS Sharmila
Highlights

సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు వై.ఎస్. షర్మిళ ఫిర్యాదు చేశారు. తమపైనా, తమ కుటుంబసభ్యులపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు వై.ఎస్. షర్మిళ ఫిర్యాదు చేశారు. తమపైనా, తమ కుటుంబసభ్యులపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. షర్మిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్ కు విచారణ బాధ్యతలు అప్పగించారు.

తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వై.ఎస్. షర్మిళ తీవ్రంగా స్పందించారు. షర్మిళకు టాలీవుడ్ హీరో ప్రభాస్ కు సంబంధం ఉందని గత ఐదేళ్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న షర్మిళ పార్టీ నేతలతో కలిసి సోమవారం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

తనకు ప్రభాస్ కు సంబంధం ఉందని కొంతమంది ప్రచారం చేస్తున్నారన్నారు షర్మిళ. ఆ వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ కలువలేదని ఒక్కసారి కూడా మాట్లాడలేదని చెప్పారు. ఆ వ్యక్తితో నాకు ఎలాంటి సంబంధం లేదు ఇది నిజం ఇదే నిజమని అన్నారు షర్మిళ.

ఇలా దుష్ప్రచారం చేస్తున్న వారు ఇవన్నీ నిజమేనని ప్రమాణాలు చేసి చెప్పగలరా..? అని ప్రశ్నించారు షర్మిళ. ఆ వ్యక్తిని కలిసినట్లు గానీ, మాట్లాడినట్లు గాని రుజువులు , ఆధారాలు చూపగలరా అని అన్నారు. పుకార్లు చూపించి వ్యక్తిత్వాన్ని చంపాలనుకోవడం దారుణం కాదా అని అన్నారు. ఇంత దిగజారుడు తనం అవసరమా..? ఈ ప్రచారం వెనుక టీడీపీ హస్తముందని ఆరోపించారు షర్మిళ.

షర్మిళపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. మహిళా నేతలపై ఇలాంటి ప్రచారం మంచి కాదన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీని కలిసిన వారిలో షర్మిళతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories