టీడీపీ, కాంగ్రెస్ నుంచి వైసీపీలో‌కి త్వరలో భారీగా వలసలు...ఇప్పటికే వంద మంది అభ్యర్థులు ఖరారు..?

jagan
x
jagan
Highlights

కొద్ది రోజుల్లో పాదయాత్ర ముగించుకోబోతున్న వైసీపీ అధినేత జగన్ తర్వాతి కార్యాచరణ ఏంటనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఏడాది పాటు సాగిన ప్రజా సంకల్ప యాత్ర తర్వాత జగన్ ఏం చేయబోతున్నారు..? ఎన్నికలకు ఎలా సిద్ధమవుతారు..? 2019లో అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి ఎలాంటి ఎత్తులు వేయబోతున్నారు అనేది ఆసక్తి కరంగా మారింది.

కొద్ది రోజుల్లో పాదయాత్ర ముగించుకోబోతున్న వైసీపీ అధినేత జగన్ తర్వాతి కార్యాచరణ ఏంటనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఏడాది పాటు సాగిన ప్రజా సంకల్ప యాత్ర తర్వాత జగన్ ఏం చేయబోతున్నారు..? ఎన్నికలకు ఎలా సిద్ధమవుతారు..? 2019లో అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి ఎలాంటి ఎత్తులు వేయబోతున్నారు అనేది ఆసక్తి కరంగా మారింది.

నవంబర్ 6 2017న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ ప్రజా సంకల్ప యాత్ర 13 ‌జిల్లాలో 125 నియోజక వర్గాలను దాదాపుగా చుట్టేసింది. జగన్ తన నడక ప్రస్థానాన్ని 3700 కిలో మీటర్ల మైలు రాయి దగ్గర ముగించబోతున్నారు. వైసీపీ అధ్యక్షుడి పాదయాత్ర జనవరి 9 లేదంటే 10 తేదీల్లో ఇచ్చాపురంలో‌ ముగియబోతోంది. ప్రజా సంకల్పయాత్ర ముగింపు రోజునే ఎన్నికల శంఖరావం పూరించేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. పాదయాత్ర ముగింపు నాడే వైసీపీ ఎన్నికల‌ మేనిఫెస్టో‌ విడుదల చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇచ్చాపురంలో పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుండి కాలి నడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. అటు తర్వాత కడప దర్గాకు వెళ్లి అక్కడ నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇడుపుల పాయలో వారం విశ్రాంతి తర్వాత జగన్ నియోజకవర్గాల వారీగా వైసీపీ పటిష్టతపై దృష్టి పెడతారని తెలుస్తోంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా విశాఖ, అనంతపురం జిల్లాలో వైసీపీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జగన్ భావిస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

పాదయాత్ర లో కవర్ కాని‌ నియోజక వర్గాల్లో బస్సు యాత్ర చేపట్టి అక్కడిక్కడ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల‌ ప్రచారానికి‌ నాందీ పలికితే బాగుంటుందని కొందరు నేతలు జగన్‌కు చెబుతున్నట్లు సమాచారం. అలాగే పార్టీలో లోటుపాట్లను సరిదిద్దుకుని ఏకంగా ప్రచారానికి వెళితే బావుంటుందని‌ మరికొందరు నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను వైసీపీ వైపు మార్చుకునేలా జగన్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు చేయించుకుంటోన్న జగన్ ఆయా నియోజకవర్గాలలొ పార్టీ కో ఆర్డినేటర్లను ఎలాంటి ‌మొహమాటాలు లేకుండా మార్పు చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల అసంతృప్తికి గురైన వారు పార్టీకి వ్యతిరేకంగా పని చేయకుండా బుజ్జగించే పనిని సీనియర్ నేతలకు ఇప్పటికే అప్పజెప్పారు.

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జగన్ ఇప్పటికే వంద మంది అభ్యర్థులను ఖరారు చేసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక తర్వాత ఎంపీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడతారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురిలో ఒకరిద్దరు సీటు త్యాగం చేయాల్సి వస్తుందంటూ వారిని ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారు జగన్. అలాగే టీడీపీ కాంగ్రెస్ నుంచి వైసీపీ లో‌కి త్వరలో భారీ చేరికలుంటాయని వైసీపీ నేతలు అంటున్నారు. వలసల తర్వాత మొత్తం 175 నియోజకవర్గాల అభ్యర్థులను‌ ఒక్కసారే ప్రకటించాలని వైసీపీ బాస్ భావిస్తున్నారని వైసీపీ శ్రేణుల సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories