logo

చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు..

చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు..
Highlights

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి. తమ...

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి. తమ కుటుంబ సభ్యుల హత్యల వెనుక బాబు పాత్ర ఉందన్నారు వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి. రాజారెడ్డిని, ఆ తర్వాత వైఎస్‌‌ను, ఇప్పుడు వివేకాను చంపేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ మృతిపై ఇప్పటికీ అనుమానాలున్నాయన్నారు. ఆనాడు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానంటూ వైఎస్‌ను ఆనాడు బాబు సవాల్ చేశారని, సవాలు చేసిన రెండ్రోజులకే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు హయాంలోనే మా కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారని జగన్ అన్నారు. మొన్నటికి మొన్న కూడా నన్ను చంపేందుకు ప్రయత్నించారు జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ హత్య వెనుక చాలా మంది ఉన్నారన్నారని జగన్ వ్యాఖ్యానించారు.


లైవ్ టీవి


Share it
Top