త్వరలో అమరావతికి వైఎస్‌ జగన్ షిఫ్ట్‌

త్వరలో అమరావతికి వైఎస్‌ జగన్ షిఫ్ట్‌
x
Highlights

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇకపై ఏపీ రాజధాని నుంచే పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలు సాగించనున్నారు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి మారడానికి...

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇకపై ఏపీ రాజధాని నుంచే పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలు సాగించనున్నారు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి మారడానికి ముహూర్తం ఖరారు చేసుకున్న జగన్‌ అతి త్వరలోనే కొత్త ఇంటిలోకి ప్రవేశించనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో దాదాపు ఇంటి నిర్మాణం పూర్తికావడంతో నూతన గృహప్రవేశం చేయనున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే తన నివాసాన్ని అమరావతికి మార్చబోతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన ఇంటికి మారబోతున్నారు. సచివాలయానికి, అసెంబ్లీకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఇంటిని నిర్మించారు. చిన్నచిన్న పనులు మినహా దాదాపు నిర్మాణం పూర్తికావడంతో ‎ఈనెల 14న గృహ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. నిర్ణయించిన ముహూర్తం మేరకు ఉదయం 8గంటల 21 నిమిషాలకు కొత్త ఇంటిలోకి వెళ్లనున్నారు.

ఇళ్లు, పార్టీ కార్యాలయం రెండు భవనాలను కలిపి దాదాపు ఎకరం విస్తీర్ణంలో నిర్మించారు. 12వందల గజాల్లో రెండు అంతస్థుల్లో ఈ ఇంటి నిర్మాణం జరిగింది. మొదటి అంతస్థులో 4 బెడ్రూమ్‌లు, రెండు మీటింగ్ హాల్స్‌ ఉండగా, సెకండ్ ఫ్లోర్‌లో మరో నాలుగు బెడ్రూమ్‌లు, రెండు మీటింగ్ హాల్స్ ఉన్నాయి. ఈ హాల్స్‌లో ఒకటి పెద్దది, మరొకటి చిన్నదిగా నిర్మాణాలు చేశారు. పార్టీ లీడర్లతో సమావేశమయ్యేందుకు ఈ హాల్స్‌‌ను వినియోగించనున్నారు.

ఇక పార్టీ కార్యాలయాన్ని కూడా 12వందల గజాల విస్తీర్ణంలోనే నిర్మించారు. హైదరాబాద్‌ లోటస్‌‌పాండ్‌లో నిర్మించిన మాదిరిగానే ఇల్లు, పార్టీ కార్యాలయం రెండూ పక్కపక్కనే ఉండేవిధంగా నిర్మాణాలు చేపట్టారు. భారీ హాల్‌తోపాటు లీడర్లు, కార్యకర్తలు, మీడియా కోసం ప్రత్యేక గదులను నిర్మిస్తున్నారు. మిగతా స్థలంలో పార్కింగ్ కాంపౌండ్ ఏర్పాటు చేశారు. మొత్తానికి ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఇకపై పూర్తిస్థాయిలో ఏపీలోనే ఉండేందుకు, అమరావతి కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు జగన్ ముహూర్తం ఖరారు చేసుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories