జగన్ లోటస్ పాండ్ ఖాళీ...ఇక వైసీపీ కేరాఫ్‌ ఏపీ!

జగన్ లోటస్ పాండ్ ఖాళీ...ఇక వైసీపీ కేరాఫ్‌ ఏపీ!
x
Highlights

ఇటీవ‌లే అమ‌రావ‌తిలో ఇంటిని, పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన వైసీపీ అధినేత, ఇక‌పై పార్టీ కార్య‌క‌లాపాల‌ను శాస్వ‌తంగా అమ‌రావ‌తికి మార్చేస్తున్నారు....

ఇటీవ‌లే అమ‌రావ‌తిలో ఇంటిని, పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన వైసీపీ అధినేత, ఇక‌పై పార్టీ కార్య‌క‌లాపాల‌ను శాస్వ‌తంగా అమ‌రావ‌తికి మార్చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన పూర్తి కార్యక్రమాలను అమరావతి నుంచే ఆపరేట్ చేయనున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌ద్యంలో వైసీపి జోష్ పెంచింది. మెున్న ప్ర‌మాణ‌స్వీకారానికి ముహూర్తాలు, నిన్న క్యాబినెట్ బెర్తులపై చ‌ర్చ‌ నేడు అమ‌రావ‌తికి పార్టీ కార్యాల‌యం త‌ర‌లింపు ఇలా గెలుపు త‌మ‌దే అంటూ వ‌రుస‌ సంకేతాలిస్తుంది వైసీపి. పోలింగ్ త‌రువాత పూర్తిగా రిలాక్స్ అయిన ఆ పార్టీ తాజాగా యాక్టివిటీ పెంచింది. వ‌చ్చే ఫ‌లితాల్లో గెలుపు మాదే అంటూ వైసీపి నేత‌లు చాల దీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ కార్యకలాపాలను ఇక నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి చేపట్టనున్నారు.

ఈ నెల 21 నుంచి వైసీపీ పార్టీ కేంద్ర‌కార్యాల‌యాన్ని అమ‌రావ‌తికి మార్చేస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ముందు తాడేప‌ల్లిలోని నూత‌న ఇంటికి గృహ‌ప్ర‌వేశం చేశారు జ‌గ‌న్. అప్పుడు పార్టీ కార్యాల‌యాన్ని కూడా ప్రారంభించారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని అమ‌రావ‌తికి మార్చుతున్నారు. ఫ‌లితాలు వ‌చ్చే లోపే పార్టీ కార్యాల‌యాన్ని అమ‌రావ‌తికి మార్చేయాల‌న్న జ‌గ‌న్ అదేశాల మేర‌కు.. వైసీపీ కేంద్ర కార్యాలయం త‌ర‌లింపు ప‌క్రియ జ‌రుగుతోంది.

హైద‌రాబాద్‌లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాల‌య సామ‌గ్రిని అమ‌రావ‌తిలోని కార్యాల‌యానికి త‌ర‌లిస్తున్నారు. ఇక ఫ‌లితాల‌కు రెండు రోజుల ముందుగా ఈనెల 21 నుంచి జ‌గ‌న్ ఇక్క‌డే ఉండ‌నున్నారు. అదే రోజు అమ‌రావ‌తిలోని నూత‌న కార్యాల‌యంలో పార్టీ అభ్య‌ర్ధుల‌తో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నిక‌ల ప‌లితాలు త‌మ‌కు అనుకూలంగానే వ‌స్తాయ‌ని చాలా ధీమాగా ఉన్న వైసీపి ఈ స‌మావేశంలో కౌంటింగ్ సమయంలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై నేత‌ల‌కు దిశానిర్దేశం చెయ్య‌నున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories