Top
logo

పంచ్ డైలాగ్స్‌తో జగన్ ఎన్నికల ప్రచారం..

పంచ్  డైలాగ్స్‌తో జగన్ ఎన్నికల ప్రచారం..
Highlights

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంచ్ డైలాగ్స్‌తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్రలో మీ...

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంచ్ డైలాగ్స్‌తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్రలో మీ కష్టాలు నేను చూశాను మీ బాధలు నేను విన్నాను రైతుల సమస్యలు చూశాను అవ్వాతాత, అక్కచెల్లెమ్మల బాధలు విన్నాను నిరుద్యోగుల ఆవేదనను చూశాను. ప్రతి పేదవాడి గుండె చప్పుడు నేను విన్నాను మీ అందరికీ ఒక్కటే హామీ ఇస్తున్నా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తున్నారు. అలాగే ప్రతి మనిషికి మేలు జరిగేలా నాలుగైదు రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ సమస్యల పరిష్కారానికి మనం నవరత్నాలను ప్రకటించుకున్నామని, ఈ నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఇచ్చే డబ్బులతో మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం అనంతపురం జిల్లా రాయదుర్గం బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. రైతన్న ఆవేదన, బాధను నేను చూశాను. మీ అందరికీ భరోసా ఇస్తూ నేను ఉన్నాను అని కచ్చితంగా చెబుతాన్నానని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.


లైవ్ టీవి


Share it
Top