Top
logo

పోలీస్‌ బాసుల పచ్చచొక్కాలు విప్పుతాం : జగన్‌

పోలీస్‌ బాసుల పచ్చచొక్కాలు విప్పుతాం : జగన్‌
X
Highlights

సీఎం చంద్రబాబు నాయుడుకు ఎన్నికలు వచ్చి నప్పుడే ప్రజలు, రైతులు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు ప్రతిపక్షనేత...

సీఎం చంద్రబాబు నాయుడుకు ఎన్నికలు వచ్చి నప్పుడే ప్రజలు, రైతులు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన గడచిన ఐదేళ్లలో ప్రజలకు మేలు చేసే పని ఒక్కటి కూడా చేయలేదని ఆరోపించారు. చేసిన పనులు లేకపోవడంతో తనపై లేని పోని విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాకు అన్ని రంగాల్లో అన్యాయం చేశారంటూ ఆరోపించారు. బాబు పాలనలో ఫిరాయింపులు, అవినీతి అగ్రస్ధానంలో ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను ఆశీర్వదించాలంటూ ఓటర్లను జగన్ కోరారు. అధికారంలోకి రాగానే పోలీస్‌ బాసులకు చంద్రబాబు నాయుడు వేసిన పచ్చచొక్కాలను విప్పుతామని జగన్‌ తెలిపారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో కిందిస్థాయి ఉద్యోగులు, హోంగార్డులకు మెరుగైన జీతాలతో పాటు వారానికో సెలవు ఇస్తామని హామీ ఇచ్చారు.

Next Story