Top
logo

ఏడాదికి రూ.12,500 చొప్పున నేరుగా పెట్టుబడులిస్తా

ys jagan
X
ys jagan
Highlights

ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానన్నారు వైసీపీ అధినేత వై.ఎస్.జగన్. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో మాట్లాడిన ఆయన ప్రతి రైతుకూ వడ్డీలేని రుణాలు అందిస్తామని చెప్పారు.

ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానన్నారు వైసీపీ అధినేత వై.ఎస్.జగన్. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో మాట్లాడిన ఆయన ప్రతి రైతుకూ వడ్డీలేని రుణాలు అందిస్తామని చెప్పారు. రైతుల సాగు ఖర్చుల తగ్గింపు, పెట్టుబడుల సాయంపై హామీలిచ్చారు. మరోవైపు చంద్రబాబు పాలనంతా అవినీతి, అబద్దాలమయమని విమర్శలు కురిపించారు జగన్.

వైసీపీ అధినేత జగన్ 2017 నవంబర్‌ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి చేపట్టిన 'ప్రజా సంకల్పయాత్ర' శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు సాగిన ప్రజాసంకల్పయాత్ర 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల గుండా సాగింది. ఇప్పటిదాకా మొత్తం 55 ఆత్మీయ సమ్మేళనాలు, 123 సభల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఆఖరి బహిరంగ సభలో చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.

ఓవైపు రాష్ట్రం కరువు, తుపానులతో అల్లాడుతుంటే చంద్రబాబు జాతీయ రాజకీయల పేరుతో పాలనను గాలికి వదిలేశారంటూ మండిపడ్డారు. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలన చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 'నిన్ను నమ్మం బాబు'అంటూ నినాదం చేస్తున్నారన్నారు. జాతీయ రాజకీయాల పేరుతో వెళ్లి నేతలను కలుస్తారు గానీ, రైతుల కష్టాలు మాత్రం పట్టించుకోరని మండిపడ్డారు జగన్.

చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతి లేదని విమర్శించారు. నిరుద్యోగ యువత నిరాశలో ఉన్నారన్న జగన్ బాబు వచ్చాడు కానీ, జాబు రాలేదని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో లక్షా 42వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా ఈ నాలుగేళ్లలో 90వేల పోస్టులు ఖాళీలొచ్చాయని చెప్పారు. మొత్తం దాదాపు 2లక్షల 20వేల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా ప్రభుత్వం భర్తీ చేయలేని మండిపడ్డారు జగన్.

తాను అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్నీ జిల్లాగా మారుస్తానని చెప్పారు. రైతులకు బీమా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని, ప్రతి రైతుకూ వడ్డీలేని రుణాలు అందిస్తానని అన్నారు. ఏడాదికి 12వేల 500 చొప్పు,న పెట్టుబడి నేరుగా అందిస్తానని, పగటిపూట 9గంటల విద్యుత్‌ను ఉచితంగా రైతులకు అందిస్తానని హామీలిచ్చారు జగన్.

పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడును తన గుండె చప్పుడుగా మార్చుకున్నానన్న జగన్. పాదయాత్రలో ఎంతమందిని కలిశామన్నది కాదని, ఎంతమందికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యమని చెప్పారు. పాదయాత్రలో తనతో పాటు అడుగులేసి నడిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు జగన్.

Next Story