logo

రేపటితో ముగియనున్న వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర

Praja Sankalpa YatraPraja Sankalpa Yatra
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు దశకు చేరుకుంది. రేపు ఇచ్చాపురంలో ఆయన పాదయాత్ర ముగించనున్నారు.

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు దశకు చేరుకుంది. రేపు ఇచ్చాపురంలో ఆయన పాదయాత్ర ముగించనున్నారు. ఈ నేపధ్యంలో ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో నిర్మిస్తున్న పైలాన్ పనులు పూర్తయ్యాయి. వైఎస్‌ఆర్‌, షర్మిల పాదయాత్రల సందర్భంగా నిర్మించిన విజయ వాటికల సమీపంలోనే ఈ పైలాన్‌ను నిర్మిస్తున్నారు. నాలుగు పిలర్లు మూడు అంతస్తులతో నిర్మిస్తున్న ఈ స్థూపం పై అంతస్తులో వైఎస్ఆర్‌, రెండో అంతస్తు నాలుగు వైపుల జగన్‌ ఫోటోలను ఏర్పాటు చేశారు .13 జిల్లాల మీదుగా సాగిన పాదయాత్రకు గుర్తుగా 13 మెుట్లతో ఈ స్థూపాన్ని నిర్మించారు.


లైవ్ టీవి


Share it
Top