Top
logo

వైసీపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

వైసీపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
X
Highlights

వైసీపీ పార్టీ శాసనసభకు పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల తొలి జాబితాను వైసీపీ అధినేత వైయస్ జగన్‌‌‌మోహన్‌రెడ్డి...

వైసీపీ పార్టీ శాసనసభకు పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల తొలి జాబితాను వైసీపీ అధినేత వైయస్ జగన్‌‌‌మోహన్‌రెడ్డి శనివారం విడుదల చేశారు. తొమ్మిది మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన జగన్‌ మిగిలిన స్థానాలను రేపు ఇడుపులపాయలో వైఎస్‌ జగన్‌ ప్రకటిస్తారని తెలిపారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం, విశాఖకు వెళ్లనున్న జగన్ నర్సీపట్నం, పి.గన్నవరంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాలో గత ఎన్నికల్లో విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు.

అరకు - గొడ్డేటి మాధవి

అమలాపురం- చింతా అనురాధ

రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి

కడప- వైఎస్‌ అవినాష్‌ రెడ్డి

హిందుపురం - గోరంట్ల మాధవ్

అనంతపురం - తలారి రంగయ్య

బాపట్ల - నందిగం సురేష్‌

చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప

కర్నూలు - డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌

Next Story