ముగింపు ద‌శ‌లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర

ముగింపు ద‌శ‌లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర
x
Highlights

వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకుంది. జనవరి 9వ తేదీన ప్రజా సంకల్ప యాత్ర ముగియబోతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ప్ర‌జా స‌మ‌స్య‌లను తెలుసుకోవడానికి ప్ర‌జా సంక‌ల్స‌యాత్రకు జగన్ శ్రీకారం చుట్టారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్ ఆర‌ున జగన్ సొంత ప్రాంతమైన క‌డ‌ప జిల్లా ఇడుపులపాయ‌ నుంచి నడక ఆరంభించారు.

వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకుంది. జనవరి 9వ తేదీన ప్రజా సంకల్ప యాత్ర ముగియబోతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ప్ర‌జా స‌మ‌స్య‌లను తెలుసుకోవడానికి ప్ర‌జా సంక‌ల్స‌యాత్రకు జగన్ శ్రీకారం చుట్టారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్ ఆర‌ున జగన్ సొంత ప్రాంతమైన క‌డ‌ప జిల్లా ఇడుపులపాయ‌ నుంచి నడక ఆరంభించారు. ప్రజలు, వివిధ వర్గాల సమస్యలు వింటూ, సామాన్యులతో మమేమకవుతూ జగన్ ముందుకు సాగుతున్నారు. రోజులకు 10 నుంచి 12 కిలోమీటర్లు నడుస్తున్న జగన్ అడుగులో లక్షలాది మంది అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న యాత్ర జ‌న‌వ‌రి 9న ఇచ్చాపురంలో ముగుస్తుంది.

ఏడాదికి పైగా సాగిన జగన్ పాద‌యాత్రలో అనేక మైళ్ళురాళ్ళున్నాయి. క‌ర్నూలు జిల్లా అళ్ళగ‌డ్డ‌లో ఈ యాత్ర 100 కిలోమీట‌ర్లకు చేరుకుంది. 500 కిలోమీట‌ర్లను దర్మ‌వ‌రంలో క్రాస్ చేశారు..జ‌గ‌న్. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరిలో 1000 కిలోమీట‌ర్లు, 1500 కిలోమీట‌ర్ల మైలురాయిని గుంటూరు జిల్లా పొన్నూరులో దాటారు. 2000 కిలోమీట‌ర్లను జగన్ ఏలూరు దగ్గర చేరుకున్నారు. ఇక తూర్పుగోదావ‌రి జిల్లా మండ‌పేట‌లో 2500 కిలోమీట‌ర్లు, విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్.కోట దగ్గర 3000 కిలోమీట‌ర్ల ప్రస్థానానికి జగన్ చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్క‌లిలో 3500 కిలోమీట‌ర్ల మైలు రాయిని కూడా అధిగమించారు.

12 జిల్లాల్లో 132 నియోజ‌క‌ర్గాలను చుడుతూ సాగింది జగన్ పాదయాత్ర. ఇప్పటికి 123 బభ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించారు. ప్రజా సంకల్పయాత్ర చివ‌రి మజిలీ శ్రీకాకుళం కాబోతోంది. 333 రోజులుగా పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ దాదాపు 3 వేల 6వందల కిలోమీట‌ర్లను అధిగమించేందుకు సన్నద్ధమవుతున్నారు. పాద‌యాత్ర ముగిసే స‌రికి దాదాపు 3650 కిలోమీట‌ర్ల‌ మైలు రాయి పూర్తవుతుంది. జనవరి 9న పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి వైసీపీ నేతలు బారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇచ్చాపురంలో పైలాన్ నిర్మాణం చేట్టారు. ముగింపు సభకు 175 నియోజ‌క‌ర్గాల‌ను నుండి ల‌క్ష మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే పాదయాత్ర ముగింపునకు సూచనగా జ‌న‌వ‌రి 6, 7,8 తేదీల్లో మూడు రోజుల పాటు నియోజ‌క‌ర్గాల్లో సంఘీబావ పాద‌యాత్ర‌లు చెయ్యాల‌ని వైసీపీ శ్రేణులకు ఆదేశాలు అందాయి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న తరుణంలో పాద‌యాత్ర ముగింపు స‌భ‌లో జ‌గ‌న్ మరిన్ని హామీలు ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories