Top
logo

భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్నాం: జగన్‌

భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్నాం: జగన్‌
X
Highlights

పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్‌ పక్కా వ్యూహం ప్రకారం పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ఉగ్రమూకల నడ్డి...

పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్‌ పక్కా వ్యూహం ప్రకారం పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ఉగ్రమూకల నడ్డి విరిచింది. ప్రత్యర్థి మేల్కొని ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆపరేషన్‌ పూర్తి చేసింది. పీఓకేలో వైమానిక దాడులు జరిపిన భారత వైమానిక దళాన్ని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్గి అభినందించారు. ఉగ్రవాదులను తుదముట్టిస్తూ వీరోచితంగా దాడులు జరిపిన ఐఏఎఫ్ ఫైలట్ బృందానికి జగన్ అభినందనలు తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై వందల కిలోల బాంబులతో దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌-2ను విజయవంతంగా నిర్వహించిన భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్నట్టు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్వీట్టర్ ద్వారా పేర్కోన్నారు.

Next Story