కొలువు కోసం చేస్తున్న పరుగులో ఆగిపోతున్నగుండెలు

కొలువు కోసం చేస్తున్న పరుగులో ఆగిపోతున్నగుండెలు
x
Highlights

ఇటీవల కాలంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణకు వచ్చి గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. శిక్షణలో భాగంగా రన్నింగ్ చేస్తూ...

ఇటీవల కాలంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణకు వచ్చి గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. శిక్షణలో భాగంగా రన్నింగ్ చేస్తూ ఇబ్రహీంపట్నంకి చెందిన ఏకాంబరం అనే యువకుడు కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మరువకముందే తాజాగా కరీంనగర్‌లో మమత అనే యువతి మృతి చెందిన ఉదంతం అందరినీ కలిసివేసింది.

కొలువు కోసం చేస్తున్న పరుగులో గుండెలు ఆగిపోతున్నాయి. ఫిజికల్ టెస్ట్‌లో ఉత్తీర్ణత కోసం సన్నద్ధమౌతున్న సమయంలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లాలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో వెలిశాల గ్రామానికి చెందిన మమత మృతి చెందారు. కానిస్టేబుల్‌ సెలక్షన్స్‌లో భాగంగా పరుగు పందెంలో మమత పాల్గొంది. అయితే పరుగుపందెం ముగిశాక కాసేపటికే గుండెపోటుతో ఆమె కన్నుమూసింది. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువౌతున్నాయి.

5 రోజుల క్రితం ఇబ్రహీం పట్నం పోలీసు కానిస్టేబుల్ శిక్షణలో అపశ్రుతి చోటుచేసుకుంది. శిక్షణలో భాగంగా రన్నింగ్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామానికి చెందిన ఏకాంబరం అనే యువకుడు కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్నాడు. ఈ శిక్షణ కోసం రాచకొండ కమిషనరేట్ కి ప్రతిరోజూ ఉదయం 6గంటలకు వచ్చేవాడు. ఈవెంట్స్ కోసం ఇబ్రహీంపట్నంలో సైంట్ కళాశాలలో శిక్ష కోసం కూడా వచ్చేవాడు. రోజూలాగానే ఫిబ్రవరి 13 ఉదయం 6గంటలకు ఇంటి దగ్గర నుంచి శిక్షణ కేంద్రానికి వచ్చిన ఆ యువకుడు రన్నింగ్ చేస్తుండగా ఒక్క సారి కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన తోటి స్నేహితులు హుటాహుటిన ఇబ్రహీంపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించే లోపే మార్గమధ్యలో కన్నుమూశాడు. ఈ ఘటనతో ఏకాంబరం కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం వస్తే తమ కుటుంబ కష్టాలు తొలగిపోతాయని భావించే యువతీ యువకులు కొలువు పరుగులో ప్రాణాలు కోల్పోవడం వారి వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories