logo

కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో అపశ్రుతి : యువతి మృతి

కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో అపశ్రుతి : యువతి మృతి

కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా పరుగు పందెంలో పాల్గొన్న మమత అనే అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందింది. మమత స్వస్థలం రామడుగు మండలం వెలిచాల గ్రామం. మమత డెడ్‌బాడీని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే, మరో అభ్యర్థికి కాలు విరిగి తీవ్రగాయాలయ్యాయి. ఇంకో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అభ్యర్థులతోపాటు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

లైవ్ టీవి

Share it
Top