Top
logo

ఆ రెండు పార్టీల పొత్తు మాకే లాభం : యోగి

ఆ రెండు పార్టీల పొత్తు మాకే లాభం : యోగి
X
Highlights

ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌వాది పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాలకుగాను, చెరో 38 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌వాది పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాలకుగాను, చెరో 38 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు మాయావతి, అశిలేష్ యాదవ్ ప్రెస్‌మీట్ పెట్టిమరీ అధికారికంగా ప్రకటించిన విషయం కూడా తెలిసిందే కాగా దీనిపై తాజాగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. రెండు పార్టీలు పొత్తుపై తీవ్రంగా విరుచుకపడ్డారు యోగి ఆదిత్యనాథ్. ఈ పొత్తు కేవలం మాయవతి, అఖిలేశ్ యాదవ్‌లు తమ ఉనికి కోసమే ఒక్కటయ్యారని యోగి ఆరోపించారు. అయినా ఆ రెండు పార్టీల బాగోతం ప్రజలకు తెలుసని అన్నారు. ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్దిచెబుతారని అన్నారు. వారి పొత్తు మాకే(బీజేపీ) కే లాభం చేకూరుస్తుందని అన్నారు. గత 2014లో సాధించిన స్థానాల కన్నా 2019లో మరీన్నీ స్థానాలను కైవసం చేసుకోని లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story