logo

పసుపు,ఎర్రజొన్న రైతులకు బీజేపీ గుడ్ న్యూస్

పసుపు,ఎర్రజొన్న రైతులకు బీజేపీ గుడ్ న్యూస్

పసుపు ఎర్రజొన్న రైతులకు బీజేపీ తీపి కబురు ప్రకటించింది. ఆర్మూరు సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నదాతలకు వరాల జల్లు కురిపించారు. నిజామాబాద్‌ పసుపు బోర్డు డిమాండ్‌ను బీజేపీ జాతీయ మ్యానిఫెస్టోలో చేరుస్తామన్నారు. అలాగే పసుపు, ఎర్రజొన్నలకు ప్రొక్యూర్మెంట్ పథకం అమలు చేస్తామని కీలక ప్రకటన చేశారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ నిజామాబాద్ పసుపు రైతుల్లో భరోసా నింపారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు అంశాన్ని జాతీయ మ్యానిఫెస్టోలో చేరుస్తున్నట్లు ప్రకటించారు. పసుపు ఎర్రజొన్నలకు మద్దతు ధర తరహాలో ప్రోక్యూర్మెంట్ పథకాన్ని అమలు చేస్తామంటూ కీలక ప్రకటన చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆర్మూర్ రైతులు ఆందోళనలకు దిగారు. నిజామాబాద్ వేదికగా ఉద్యమాలు చేశారు.

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిజామాబాద్ బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. తనను గెలిపిస్తే మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న ధర్మపురి అర్వింద్ అలాగే పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.

లైవ్ టీవి

Share it
Top