యడ్డీ ముడుపుల డైరీ కలకలం...పార్టీ నేతలకు 15వందల కోట్ల ఇచ్చారని...

యడ్డీ ముడుపుల డైరీ కలకలం...పార్టీ నేతలకు 15వందల కోట్ల ఇచ్చారని...
x
Highlights

లోక్‌సభ ఎన్నికళ వేళ కమలనాథులకు గట్టి షాక్ తగిలింది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ పెద్దలకు రూ.1,500...

లోక్‌సభ ఎన్నికళ వేళ కమలనాథులకు గట్టి షాక్ తగిలింది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ పెద్దలకు రూ.1,500 కోట్లు ఇచ్చారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. యెడ్డీ డైరీస్ పేరుతో ది కారవాన్ మ్యాగజైన్ ప్రచురించిన కథనంలో ఎవరెవరికి ఎంత ముట్టజెప్పారన్నది అంకెలతో సహా ప్రచురించింది. ఇప్పుడు ఈ కథననం అటు కర్నాటకలో ఇటు దేశ రాజధానిలోనూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది.

యడ్యూరప్ప డైరీలో బీజేపీ కేంద్ర కమిటీకి వెయ్యి కోట్లు, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీకి ఒక్కొక్కరికి150 కోట్ల చొప్పున, రాజ్‌నాథ్‌సింగ్‌కు రూ.100 కోట్లు, అలాగే బీజేపీ సీనియర్ నేతలైన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్ల చొప్పున అందజేసినట్లు డైరీలో రాసి ఉన్నట్లు కారవాన్ మ్యాగజైన్ ప్రచురించింది. అంతేకాకుండా గడ్కరీ కుమారుడి పెళ్లికి యడ్యూరప్ప రూ.10కోట్లు చెల్లించినట్లు డైరీలో ఉన్నట్లు తెలిపింది. ఇప్పుడు ఈ కథనం అటు కర్ణాటకలో, ఇటు దేశ రాజధానిలో పెనుదుమారం సృష్టించింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన డైరీ లీక్స్ తో బీజేపీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ కు సరికొత్త అస్త్రం అందివచ్చినట్లయ్యింది బీజేపీ నేతలు కోట్ల ముడుపులు తీసుకున్నట్లుగా వచ్చిన వార్తలపై వెంటనే దర్యాప్తు జరిపించి నిజానిజాలను నిర్ధారించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలందరూ తమ నిజాయయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ చౌకీదారులందరూ దొంగలే అవినీతి పరులే అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

యడ్యూరప్ప మాత్రం కారవాన్‌లో ప్రచురితమైన కథనాన్ని కొట్టి పారేశారు. ఓట్లకోసమే కాంగ్రెస్ పార్టీ ఓ కట్టుకథ అల్లిందని ఆరోపించారు. అస్తవ్యస్తంగా ఉన్న కాంగ్రెస్ శిబిరం నకిలీ పత్రాలను అడ్డుపెట్టుకొని రాజకీయంగా గట్టెక్కాలని చూస్తుందని మండిపడ్డారు. డైరీ పేరుతో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు యడ్యూరప్ప. మరో వైపు యడ్యూరప్ప డైరీ లీక్ అంశాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తోసి పుచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఆపార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలపై యడ్యూరప్ప డైరీ లీక్స్ ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్నది అన్ని రాజకీయ పార్టీలు జోరుగా చర్చించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories