logo

టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేత..

టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేత..

ఎన్నికల నగారా మోగిన వేళ ఏపీలో రాజకీయం మరింత వేడేక్కింది. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీలలో జోరుగా వలసల బాట పడుతున్నారు. తాజాగా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ కృష్ణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఘంటా మురళీ కృష్ణకి పసుపు కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఘంటా మురళీ కృష్ణతో పాటు ఘంటా సత్యంబాబు, బొప్పన అంజయ్య, టి.లక్ష్మయ్య, కేశవరావు, సుబ్బారావు, బొల్లినేని శ్రీనివాసరావు, వెల్ది కృష్ణమూర్తి, పెండ్యాల ప్రసాద్ టీడీపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఘంటా మురళీ కృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఏపీలో చేసిన అభివృద్ధిని చూసే తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. నారా చంద్రబాబు నాయుడ్ని మరోసారి ఏపీ ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. కాగా గత 2014 ఎన్నికల అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ వైసీపీలో చేరారు. ఘంటా మురళీ కృష్ణకి పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైసీపీ అధిష్ఠనం అప్పగించింది. అయితే గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.

లైవ్ టీవి

Share it
Top