యుద్ధం మొదలైతే ఎక్కడికి వెళ్తుందో: ఇమ్రాన్‌

యుద్ధం మొదలైతే ఎక్కడికి వెళ్తుందో: ఇమ్రాన్‌
x
Highlights

రెండు దేశాల మధ్య యుద్ధం అంటూ మొదలైతే అది ఎక్కడికి వెళ్తుందో తెలియదని, ఒకసారి యుద్ధం మొదలైతే కనుక తన చేతుల్లో కానీ, మోదీ చేతుల్లో కానీ అది ఉండదని...

రెండు దేశాల మధ్య యుద్ధం అంటూ మొదలైతే అది ఎక్కడికి వెళ్తుందో తెలియదని, ఒకసారి యుద్ధం మొదలైతే కనుక తన చేతుల్లో కానీ, మోదీ చేతుల్లో కానీ అది ఉండదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ మేరకు పాక్‌ ప్రజలనుద్దేశించి ఆయన బుధవారం మాట్లాడారు. పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని పలుసార్లు భారత్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ''మా భూభాగంలోకి మీరు వచ్చారు.. మీ భూభాగంలోకి మేం వచ్చాం'' అని భారత వాయుసేన దాడి, అందుకు పాక్‌ ఇవాళ చేపట్టిన దాడులను ప్రస్తావించారు. పుల్వామా, ఇతర అంశాలపై భారత్‌తో తాము చర్చకు సిద్ధమని తెలిపారు. చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాలు లెక్క తప్పాయని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య ఆయుధాలున్నాయని లెక్క తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories