Top
logo

ఆమెకు అగ్ర తాంబూలం!

ఆమెకు అగ్ర తాంబూలం!
X
Highlights

లేచింది మహిళా లోకం దద్ధరిల్లింది పురుష ప్రపంచం పాట తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మారుమ్రోగనుంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి పైగా మహిళాలు సర్పంచులు ఎన్నికకానున్నారు.

లేచింది మహిళా లోకం దద్ధరిల్లింది పురుష ప్రపంచం పాట తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మారుమ్రోగనుంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి పైగా మహిళాలు సర్పంచులు ఎన్నికకానున్నారు. వార్డుల్లోనూ సగానికి పైగా సీట్లలోవనితలు పాగా వేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ఒకటింట మూడు వంతుల(1/33) స్థానాలను కేటాయించాలని రాజ్యాంగం సూచించింది. తెలంగాణ సహా 19 రాష్ట్రాలు 50 శాతం సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలు వారికే కేటాయిస్తున్నాయి.

పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు అయిన స్థానాలతోపాటు, ఎవరికీ రిజర్వు కాని చోటా సగం స్థానాలు ఈ దఫా మహిళలకు లభించాయి. వాటిని లాటరీ ద్వారా అధికారులు ఎంపిక చేశారు. తెలంగాణలోని 12,751 పంచాయతీలలో సగం మేర అంటే 6,378 పంచాయతీలలో మహిళా సర్పంచులే ఎన్నిక కాబోతున్నారు. మరోవైపు మహిళలకు రిజర్వు కాని స్థానాల్లోనూ పోటీ చేసేందుకు మహిళలు అర్హులే. ఒకవేళనెగ్గితే మహిళ సర్పంచ్ ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. వార్డుల్లోనూ మహిళా సభ్యుల సంఖ్య 50 శాతం కంటే ఎక్కువ పెరగనుంది. వార్డుల విసయానికొస్తే మొత్తం 1.13 లక్షల వార్డుల్లో 56,690 మహిళలే దక్కనున్నాయి.

దేశంలో 19,992 మంది మహిళా సర్పంచులతో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉంది. 6,378 మహిళా సర్పంచ్ లతో తెలంగాణ అయిదో స్థానం దక్కించుకుంది. పంచాయతీల్లో 50 శాతానికి పైగా పదవులు మహిళలకు కేటాయిస్తున్న పర్కార్ లు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించడంలేదని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Next Story