ఓ చిన్నారికి తన చనుపాలు తాగించి ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్

women constable
x
women constable
Highlights

నవమాసాలు మోసిన తల్లి కన్న బిడ్డను వదిలేసింది. ఆకలితో అలమటిస్తున్న ఆ చిన్నారితో సంబంధమే లేని మరో తల్లి తన చనుపాలు తాగించి ప్రాణాలు కాపాడింది.

నవమాసాలు మోసిన తల్లి కన్న బిడ్డను వదిలేసింది. ఆకలితో అలమటిస్తున్న ఆ చిన్నారితో సంబంధమే లేని మరో తల్లి తన చనుపాలు తాగించి ప్రాణాలు కాపాడింది. కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆ మహిళ ప్రస్తుతం ప్రసూతి సెలవుల్లో ఉంది. ఆమె భర్త కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన వారిలో ఉన్న మానవత్వాన్ని మాతృత్వ ప్రేమను చాటి చెప్పింది. ఈ ఘటన డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఉస్మానియా ఆస్పత్రి గేటు వద్ద చోటు చేసుకుంది.

వీళ్లపేర్లు రవీందర్, ప్రియాంక ఇద్దరూ భార్యాభర్తలు. రవీందర్ అఫ్జల్ గంజ్ పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ప్రియాంక బేగం పేట మహిళా పోలీస్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. డిసెంబర్ 31 రాత్రి పది గంటల ప్రాంతంలో భర్త రవీందర్ ప్రియాంకకు ఫోన్ చేశాడు. తన స్టేషన్‌కి ఓ వ్యక్తి రెండు నెలల పాపని తీసుకొచ్చాడని ఆ పాప ఆకలితో ఏడుస్తుందని చెప్పాడు. ఇంట్లో తన బాబుతో ఉన్న ప్రియాంక మనసు చలించి పోయింది. వెంటనే ఆ సమయంలో క్యాబ్ లో బయలుదేరి తన భర్త పనిచేస్తోన్న అఫ్జల్ గంజ్ పోలీస్టేషన్‌కి వచ్చింది. ఆకలితో ఉన్న ఆ బిడ్డకు పాలు ఇచ్చింది. అప్పటి దాకా కళ్లు తెరవని ఆ బిడ్డ పాలు తాగిన తర్వాత కళ్లు తెరిచింది.

డిసెంబర్ 31 రాత్రి 9గంటల ప్రాంతంలో ఉస్మానియా ఆస్పత్రి సమీపంలో ఆటో కోసం ఎదురు చూస్తున్న అర్షద్ ఉద్దీన్‌కు తాగిన మైకంలో ఓ మహిళ కనిపించింది. తన రెండు నెలల పాపను పట్టు కోమని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఎంతకీ తిరిగి రాలేదు. పాప వెక్కి వెక్కి ఏడుస్తుండటంతో అర్షద్ పాలు కొని తాగించ బోయాడు. అయినా తాగక పోవడంతో ఏం చేయాలో తెలియక ఆ పాపను పక్కనే ఉన్న అఫ్జల్ గంజ్ పోలీస్టేషన్ కు తీసుకొచ్చాడు.

స్టేషన్లో డ్యూటీ ఉన్న రవీందర్ అతని భార్యకి ఫోన్ చేయడం ఆమె వెంటనే క్యాబ్‌ బుక్ చేసుకుని అక్కడికి రావడం వచ్చిన ఆమె పాప కి పాలు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. తర్వాత చికిత్స నిమిత్తం పాతబస్తీ లోని ప్రసూతి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే ఎవరో తెలియని అనారోగ్యంగా ఉన్నా పాపకి ఆ మహిళా కానిస్టేబుల్ పాలు ఇవ్వడం గమనించిన అర్షద్ ఆ పోలీస్ కు సెల్యూట్ చేశాడు. ఈ పాప విషయం తెలియగానే వెంటనే వచ్చి ఇలా పాలు ఇచ్చిన తన భార్య గొప్ప మనసు చూసి రవీందర్ మురిసిపోయాడు. కానిస్టేబుల్ దంపతులు చేసిన పనిని కొనియాడారు. పాపకి పాలిచ్చి గొప్ప మనసుకి ఏమి ఇచ్చనా తక్కువే అని కొనియాడారు. ఇద్దరినీ అభినందిచిన సీపీ వాళ్ళ బాబుకు ఓ బహుమతిని అందజేసారు. హైద్రాబాద్ పోలీస్ ఈ సంవత్సరాన్ని ఓ గొప్ప కార్యంతో ముగిస్తున్నామని సీపీ అంజనీ కుమార్ ఎంతో గర్వంతో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories