వైసీపీలో నారీ శక్తి...

వైసీపీలో నారీ శక్తి...
x
Highlights

రాష్ట్రంలో వైకాపా 151 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక నారీ మనుల విషయానికొస్తే వైకాపా నుంచి మొత్తం 15 మంది మహిళలు...

రాష్ట్రంలో వైకాపా 151 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక నారీ మనుల విషయానికొస్తే వైకాపా నుంచి మొత్తం 15 మంది మహిళలు బరిలోకి దిగితే 13 మంది ప్రభంజనం సృష్టించారు. తెదేపా నుంచి ఒకరు గెలుపొందారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మహిళా అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. వైసీపీ తరుపున 15 మంది పోటీ చేయగా, 13 మంది విజయం సాధించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో వైసీపీ నుంచి ముగ్గురు మహిళా అభ్యర్థులు విజయం సాధించారు.

నగరి నుంచి ఆర్‌క్కే రోజా, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, పాలకొండ నుంచి ఎస్టీ కోటాలో విశ్వసరాయ కళావతి, కురుపాం నుంచి ఎస్టీ కోటాలో పాముల పుష్ప శ్రీవాణి, పాడేరు నుంచి ఎస్టీ కోటాలో కే.భాగ్యలక్ష్మీ, రంపచోడవరం నుంచి ఎస్సీ కోటాలో నాగులపల్లి ధనలక్ష్మీ, కొవ్వూరు నుంచి ఎస్సీ కోటాలో తానేటి వనిత, ప్రత్తిపాడు నుంచి ఎస్సీ కోటాలో మేకతోటి సుచరిత గెలుపొందారు. ఇక చిలకలూరిపేట నుంచి రజని, పత్తికొండ నుంచి కె.శ్రీదేవి, సింగనమల నుంచి ఎస్సీ కోటాలో జొన్నలగడ్డ పద్మావతి, కల్యాణదుర్గం నుంచి కేవీ ఉషా శ్రీచరణ్‌ వైఎస్‌ఆర్‌ పార్టీ తరుపున ఎన్నికల బరిలో గెలుపొందారు.

తెలుగు దేశం నుంచి 19 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా, వారిలో రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి భవాని ఒక్కరే విజయం సాధించారు. ఇదిలా ఉంటే జనసేన పార్టీ నుంచి మొత్తం 21 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దించగా అందరూ ఓటమిపాలయ్యారు. అయితే జగన్‌ కేబినెట్‌లో 5 మహిళలకు అవకాశం దక్కనుందని హాగానాలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నగరి నుంచి గెలుపొందిన రోజా, శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి విశ్వసరాయ కళావతి, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, విజయనగరం జిల్లా కురుపాం నుంచి పాముల పుష్ప శ్రీవాణి, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి తానేటి వనితకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు ఉన్నట్టు వైసీపీ వర్గాల సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories