శబరిమలలోకి వెళ్లిన మహిళపై అత్త దాడి

కేరళలోని శబరిమల ఆలయంలోకి ఇటీవల ప్రవేశించి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గపై దాడి జరిగింది. నిన్న ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెపై ఈ దాడి జరిగింది.
కేరళలోని శబరిమల ఆలయంలోకి ఇటీవల ప్రవేశించి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గపై దాడి జరిగింది. నిన్న ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెపై ఈ దాడి జరిగింది. సొంత అత్తగారే కనకదుర్గ తలపై బలంగా మోదిందని, ప్రస్తుతం మల్లాపురం జిల్లాలోని ఓ ఆస్పత్రిలో కనకుదుర్గ చికిత్స పొందుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కనకదుర్గ ఆరోగ్య పరిస్థితి నిలికడగానే ఉందని చెబుతున్నారు.
గత జనవరి 2న శబరిమల ఆలయంలోకి 39 ఏళ్ల కనకదుర్గ, 40 ఏళ్ల బిందు అమ్మిని ప్రవేశించారు. దీంతో ఆలయం అపవిత్రమైందంటూ ఆలయం తలుపులు మూసేసిన పూజారులు సంప్రోక్షణ అనంతరం గుడి తలుపులు తెరిచారు. హిందూ సంప్రదాయాలను గౌరవించే తమ కుటుంబంలోని మహిళ ఆలయం ప్రవేశించిందంటే నమ్మలేకున్నానని, దీని వెనుక బలమైన కుట్రే ఉందని అప్పట్లో కనకదుర్గ సోదరుడు వ్యాఖ్యానించారు. తన సోదరిని భయపెట్టి ఆలయానికి తీసుకువెళ్లి ఉంటారని, ప్రస్తుతం ఆమె ఆచూకీ తెలియడం లేదని కూడా ఆయన అన్నారు. కనకదుర్గ ప్రాణాలకు ముప్పుకూడా ఉందన్నారు.
మరోవైపు కోజికోడ్‌లోని కనకదుర్గ ఇంటిముందు నిరసనలు కూడా జరిగాయి. దీంతో బిందు, కనకదుర్గ గత రెండు వారాలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడ్నించే వారు తమకు బెదరింపులు వస్తున్నాయని, అధికారులు తమకు తగిన భద్రత కల్పించాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఇంటికి తిరిగివస్తుండగా కనకదుర్గపై సొంత అత్తే దాడి చేయడంతో ఆమె తలకు గాయమై ఆసుపత్రిపాలైంది.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...
14 Aug 2022 4:00 PM GMTహైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్...
14 Aug 2022 3:00 PM GMTపేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
14 Aug 2022 2:30 PM GMT3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్
14 Aug 2022 2:00 PM GMTసోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMT