భార్య సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తే.. భర్త కాళ్లు విరగొట్టాడు!

భార్య సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తే.. భర్త కాళ్లు విరగొట్టాడు!
x
Highlights

వెర్రి వెయ్యిరకాలు. లోకోభిన్నరుచి అంటారు కదా. ఫ్యాషన్ ప్రపంచంలో దేనికి హద్దే వుండదు. కానీ శృతి మించుతున్న ఫ్యాషన్లూ ఒక్కొక్కసారికొంపముంచుతున్నాయి. అందులోనూ పాము ఫ్యాషన్లు అసలు మంచివి కాదని హితబోధన చేస్తున్నారు.

వెర్రి వెయ్యిరకాలు. లోకోభిన్నరుచి అంటారు కదా. ఫ్యాషన్ ప్రపంచంలో దేనికి హద్దే వుండదు. కానీ శృతి మించుతున్న ఫ్యాషన్లూ ఒక్కొక్కసారికొంపముంచుతున్నాయి. అందులోనూ పాము ఫ్యాషన్లు అసలు మంచివి కాదని హితబోధన చేస్తున్నారు. ఫ్యాషన్‌ లుక్‌లో నాగకన్యలా కనిపించాలని ఓ యువతి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అసలేం జరిగిందో తెలియాలంటో స్టోరీకి ఎంటర్‌ కావాల్సిందే. ష్యాషన్ మాయజాలం ఓ యువతి కాళ్లు విరిగేలా చేసింది. ఫ్యాషన్‌ లుక్‌తో భర్తను భయపెట్టాలని భంగపాటుకు గురైంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్నేక్‌ లెగ్గింగ్స్‌ను చూసి మనసు పారేసుకున్న యువతి ఓ జత కొనుగోలు చేసింది.

భర్తను ఆటపట్టించడానికి పాము శరీరం, తలను పోలిన లెగింగ్స్‌ కాళ్లకు తొడుక్కుని మరీ నిద్రపోయింది. అచ్చం పాములా ఉన్నట్లు మెలికలు తిరుగుతూ పడుకుండిపోయింది. అసలు విషయం తెలియని ఆమె భర్త పడగ్గదిలోకి ఎంటరయ్యారు. బెడ్‌పై రెండు పాములు కదలాడుతున్నట్టు కనిపించడంతో అవాక్కైన అతడు బేస్‌బాల్ బ్యాట్ తీసుకుని చితగ్గొట్టాడు.

భర్త బాదుడును భరించలేని యువతి కుర్రోమొర్రో అంటూ కేకలు వేసింది. భార్య కూడా పాములను చూసి భయపడిందనుకుని మరో దెబ్బ గట్టిగా వేశాడు. బాధతో గట్టిగా అరుస్తూ అవి పాములు కావని, తన కాళ్లని చెప్పందీ.బ్యాట్ దెబ్బలు తాళలేక కన్నీరు పెట్టుకున్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె కాళ్లకు స్కాన్ చేసిన వైద్యులు ఎముకలు విరిగినట్టు తేల్చారు. మొత్తానికి ఫ్యాషన్ వెర్రి తలలు వేస్తే ఏమవుతుందో చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన ఘటన ఆస్ట్రేలియా మెల్ బోర్న్‌లో జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories