మెక్‌డొనాల్డ్స్ చికెన్ వింగ్స్‌లో కోడి ఈకలు..

మెక్‌డొనాల్డ్స్ చికెన్ వింగ్స్‌లో కోడి ఈకలు..
x
Highlights

సింగపూర్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో ఓ మహిళ తనకు ఇష్టమైన చికెన్ వింగ్స్‌ అడర్ చేసింది. కొద్ది నిమిషాల తరువాత అడర్ రేడి అయింది. డబ్బులు కట్టి...

సింగపూర్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో ఓ మహిళ తనకు ఇష్టమైన చికెన్ వింగ్స్‌ అడర్ చేసింది. కొద్ది నిమిషాల తరువాత అడర్ రేడి అయింది. డబ్బులు కట్టి తన అడర్‌ని ఇంటికి తీసుకెళ్లింది. తీరా ఇంటికి వెళ్లే చూసేసరికి చికెన్ వింగ్స్‌లో కోడి ఈకలు ఉన్నాయి. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ మెక్‌డొనాల్డ్స్‌పై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 21న మెక్‌డానాల్డ్స్‌కు చెందిన ఓ రెస్టరెంట్‌లో మహిళ చికెన్ వింగ్స్‌ను తీసుకెళ్లింది. తన కూతురు వింగ్స్ తింటున్న సమయంలో ఈకలు ఉండటం గుర్తించానని మహిళా ఆరోపిస్తోంది. అయితే అప్పటికే తన కూతురు తెలియకుండానే మూడు వింగ్స్ తిన్నదని, తిన్న కొద్దిసేపటికే తన కూతురుకి కడుపంతా వికారంగా ఉన్నట్టు తనతో చెప్పిందని మహిళ ఆరోపించింది.

కాగా మిగతా వింగ్స్‌ను పరిశీలించగా వాటిలో ఈకలు ఉన్నాయని మహిళ తెలిపింది. ఆ మహిళా తిరిగి రెస్టారెంట్‌ లో ఉన్నవాళ్లని నిలదీయగా వారు కాంపెన్‌జేషన్ ఇస్తామని చెప్పారు. వారి కాంపెన్‌జేషన్‌ను తిరస్కరించిన మహిళ వెంటనే రాష్ట్ర ఆహార మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు ఆ రెస్టారెంట్ పై ఫిర్యాదు చేసింది. అసలు ఎంతో మంది తినే ఆహార భద్రతపై మెక్‌డొనాల్డ్స్ తీసుకునే జాగ్రత్తలు ఇవేనా అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories