logo

ఓటేసిన అనంతరం గుండెపోటుతో మృతి

ఓటేసిన అనంతరం గుండెపోటుతో మృతి

వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూర్‌లో విషాదం చోటు చేసుకుంది. మూడో విడత పంచాయతి ఎన్నికల్లో భాగంగా గ్రామంలోని పోలింగ్‌ బూతులో ఓటు వేసేందుకు వెళ్లిన వృద్ధురాలు మృతిచెందింది. గ్రామానికి చెందిన కోరె వెంకటమ్మ ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓటింగ్ కేంద్రానికి చేరుకుంది. ఓటు వేసిన అనంతరం పోలింగ్‌ బూతులో నుంచి బయటకు వస్తుండగా గుండె పోటు రావడంతో అక్కడిక్కడే కుప్పకూలింది. హుటాహుటినా ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయింది.

లైవ్ టీవి

Share it
Top