అత్తను చితకబాదిన కోడలు..

అత్తను చితకబాదిన కోడలు..
x
Highlights

హర్యానాలోని మహేంద్రఘర్ జిల్లాలోని నైవాజ్ నగర్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. అత్తగారిని తల్లిలా చూసుకోవాల్సిన కోడలే అత్తను తీవ్రంగా...

హర్యానాలోని మహేంద్రఘర్ జిల్లాలోని నైవాజ్ నగర్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. అత్తగారిని తల్లిలా చూసుకోవాల్సిన కోడలే అత్తను తీవ్రంగా చితకబాదింది. వేర్వేరు విషయాల్లో విసుగుచెందిన కోడలు ఆ కోపాన్ని తన అత్తగారిపై చూపించింది. ముసలి వయసులో మంచానికి పరిమితమైన ఆ పెద్దావిడ కోడలి దెబ్బలకు తట్టుకోలేక నానా అవస్థలు పడుతోంది. ఈ దృశ్యాలను అక్కడున్న ఓ అమ్మాయి తన సెల్‌ఫోన్‌లో బంధించి వైరల్ చేసింది. దీంతో ఆ వీడియో పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేశారు. నైవాజ్ నగర్‌కు చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోడలు పరారీలో ఉంది. పరారీలో ఉన్న కోడలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories