logo

ఏపీ ఎన్నికల బరిలోకి టీఆర్ఎస్...విజయవాడ నుంచి పోటీ చేయనుందా?

ఏపీ ఎన్నికల బరిలోకి టీఆర్ఎస్...విజయవాడ నుంచి పోటీ చేయనుందా?
Highlights

సార్వత్రిక సమరానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక నగారా మోగడంతో ఒక్కసారిగా...

సార్వత్రిక సమరానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక నగారా మోగడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 17వ లోక్‌ సభ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా ఏపీ రాజకీయాలపై టీఆర్ఎస్ పార్టీ పెత్తనం చేసేందుకు రెడీ అవుతుందా ? అంటే అవును అనే సమాధానమిస్తున్నాయి. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త కొణిజేటి ఆదినారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల బరిలో దిగుతుందని చెప్పారు. అయితే రాజధాని ప్రాంతమైన సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి తరపున కొణిజేటి ఆదినారాయణ పోటీ చేయడానికి సై అన్నారు. టీఆర్ఎస్ బీఫామ్ కోసం కొణిజేటి ఆదినారాయణ హైదరాబాద్ కు పయనమయ్యారు. ఏపీలో ప్రధాన పార్టీల మీద గెలిచి కేటీఆర్ కు గిఫ్ట్ ఇస్తామంటున్నారు కొణిజేటి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో కనుక టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగితే మాత్రం రాజకీయంగా అనేక పెనుమార్పులు రావోచచ్చంటున్నారు విశ్లేషకులు. అయితే ఇదే సమయంలో ఇటు ఏపీలో, తెలంగాణలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు చాల తక్కువ సమయం ఉంది. ఇక దీంతో ఇప్పటికే అధికార పార్టీలు అనేక వ్యవహారాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సమయంలో టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏపీలో ఎన్నికల బరిలో దిగే అవకాశలు లేవనే చెబుతున్నాయి. కాగా టీఆర్ఎస్ కార్యకర్త కొణిజేటి ఆదినారాయణ ప్రతిపాదనపై టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలంటే ఇంకాస్త సమయం ఆగాల్సిందే. మొత్తానికి ఏపీలో పోటీపై కొణిజేటి చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా దూమరం రేపుతోంది.


లైవ్ టీవి


Share it
Top