గాజువాకలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా ? పవన్‌ గెలుపుపై ఉత్కంఠ..

గాజువాకలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా ?  పవన్‌ గెలుపుపై ఉత్కంఠ..
x
Highlights

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. నేతల తలరాతలు ఓట్లు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యాయి. ఈ సారి ఎన్నికల్లో ఏపీలో పోలింగ్ శాతం పెరగడంతో ఎవరి...

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. నేతల తలరాతలు ఓట్లు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యాయి. ఈ సారి ఎన్నికల్లో ఏపీలో పోలింగ్ శాతం పెరగడంతో ఎవరి తలరాతలు ఎలా మారుతాయో తెలియక అభ్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక గెలుపు ధీమాపై అధికారపార్టీ టీడీపీ, వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలు మొగ్గుచూపి మరోసారి అధికార పార్టీ టీడీపీ అంటోంది. ఇక వైసీపీ సైతం గత ఐదేండ్ల పాలనపై ప్రజలు తీవ్రవ్యతిరేఖతతో ఉన్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటుతో టీడీపీకి బుద్ధిచెప్పి వైసీపీకే అధికార పగ్గాలు చేపట్టానున్నాయని ఇలా ఇరూ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో కొంత సత్తా చాటితేనే ఏపీ రాజకీయాల్లో తమకు భవిష్యత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన భావిస్తోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో పోలింగ్‌ సరళి ఉత్కంఠభరింతంగా సాగింది. పవన్ గెలుస్తారా? లేదా? అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తికర అంశంగా మారింది.

మొత్తం 3,09,326 ఓటర్లతో జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో తెలుగుదేశం పార్టీ నుండి పల్లా శ్రీనివాసరావు, వైసీపీ నుండి తిప్పల నాగిరెడ్డి బరిలో దిగారు. ఇక ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ, వైసీపీ పార్టీలను ఢీకొట్టి విజకేతనం ఎగురవేస్తారా? లేదా ? అన్నది తీవ్ర ఆస్తక్తి రేపుతోంది. గత2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన నాగిరెడ్డి సానుభూతి అస్త్రంగా ప్రచారం చేశారు. వైసీపీ వర్గీయులు గత అయిదు రోజులుగా భారీస్థాయిలో తాయిలాలు పంచారు. కేవలం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లారు. పవన్‌కు గాజువాకలో మొదటి నుంచి నుంచి పలు అవాంతరాలు ఎదురవుతానే ఉన్నాయి. ఒక బహిరంగసభ రద్దు కావడం, వడదెబ్బ కారణంచే గాజువాకలో విస్తృత ప్రచారం చేసే ఛాన్స్ దొరక్కపోవడం ఇబ్బందిగా మారాయి. ఇక తెలుగుదేశం అభ్యర్ధి పల్లా శ్రీనివాసరావు కూడా విస్తృత ప్రచారం చేపట్టారు. తమ ప్రభుత్వం చేసిన పథకాలే తమను గెలుపు దీశగా తీసుకెళ్లయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలామంది పవన్‌ అభిమానులు పోలింగ్‌ బూత్‌లకు వచ్చినా ఈవీఎంలు ఓటర్లకు చుక్కలు చూపించాయి. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈవీఎంలు మెరాయించడంతో ఓటర్లు అసహనానికి గురై కొందరు వెనక్కి వెళ్లిపోయారని సమాచారం. అయితే పవన్‌కు గంగవరం, అగనంపూడి, కూర్మన్నపాలెం, దువ్వాడ, మింది, వడ్లపూడి తదితర ప్రాంతాల నుంచి గట్టి మద్దతు లభించినట్టు తెలుస్తోంది. మొత్తానికి గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అన్నది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories