పూరీ నుంచి మోడీ పోటీ?

పూరీ నుంచి మోడీ పోటీ?
x
Highlights

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా?

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ఒడిశాలోని పూరీ నియోజకవర్గం నుండి ఎన్నికల బరీలో దిగనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ప్రధాని మోడీ మాత్రం వచ్చే ఎన్నికల్లో పూరీ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత, శాసనసభ్యులు ప్రదీప్ పురోహిత్ బుధవారం తెలిపారు. మోడీ పూరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు 90శాతం అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రధాని మోడీకి ఒడిశా ప్రజలు అంటే చాలా ప్రేమ. పూరీ నియోజకవర్గానికి మోడీకి మంచి సంబంధాలున్నాయని కావునా వచ్చే ఎన్నికల్లో మోడీ పూరీ నుండి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. ప్రధాని అభ్యర్థిని పూరీ నుంచి పోటీ చేయించాలని గతేడాది అక్టోబర్ లో బీజేపీ నేతలు సూత్రప్రాయంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఒక వేళ మోదీ ఒడిశా నుంచి పోటీ చేసే గెలిస్తే మాత్రం సిట్టింగ్ ప్రధానమంత్రిగా మోడీ రెండో వ్యక్తి అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories