శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు పూడిక గండం

sriram sagar project
x
sriram sagar project
Highlights

ఓ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రదాయనీ మరో జలాశయం అన్నపూర్ణ లాంటిది. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఆ ప్రాజెక్టులకు గడ్డుపరిస్థితులు దాపురించాయి పూడిక రూపంలో గండం పొంచి ఉంది. ఏటా ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతున్న పూడికతో ఆ జలాశయాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది.

ఓ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రదాయనీ మరో జలాశయం అన్నపూర్ణ లాంటిది. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఆ ప్రాజెక్టులకు గడ్డుపరిస్థితులు దాపురించాయి పూడిక రూపంలో గండం పొంచి ఉంది. ఏటా ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతున్న పూడికతో ఆ జలాశయాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ప్రాజెక్టుల బాటపట్టిన సీఎం కేసీఆర్ ఇందూరు ప్రాజెక్టులపై ఎంతవరకు దృష్టి పెడతరో అన్నది ఇందురు వాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు పూడిక రూపంలో గండం పొంచి ఉంది. ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంలా మారింది. ఉత్తర తెలంగాణకు వరప్రదాయనీగా 1963లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మించారు.112 టీఎంసీల సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకే వరప్రదాయినిగా నిలిచింది.

ప్రతీ ఎటా ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటితో జలాశయంలోకి పెద్ద ఎత్తున పూడిక వచ్చి చేరుతోంది. పూడిక చేరికపై గతంలోనే హైడ్రాలిక్ సర్వే చేపట్టిన ప్రభుత్వం సుమారు 32 టీఎంసీల నీటి నిల్వ మేర పూడిక పేరుకుపోయనట్లు గుర్తించింది. సీల్ట్ తొలగించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసినా ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. పూడిక తొలగిస్తే నీటి నిల్వ సామర్ధ్యం ప్రస్తుతం ఉన్న 80 టీఎంసీలకు అదనంగా మరో 30 టీఎంసీలు పెరిగే అవకాశం ఉంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అన్నపూర్ణగా మార్చిన నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్ధితి మరీ దయనీయంగా మారింది. పేరుకుపోతున్న పూడికతో ప్రాజెక్టులో 60 శాతం మేర నీటి నిల్వ సామర్ధ్యం కోల్పోయింది. పూడికతో డ్యాం సేఫ్టీకి ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటున్నారు జలరంగ నిపుణులు. 29 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 17 టీఎంసీల నీటిని నిల్వ మాత్రమే నిల్వ చేసే పరిస్ధితికి పూడిక చేరుకుంది.

తెలంగాణ కోటి ఎకరాల మగానీలా మారుస్తామంటున్న ప్రభుత్వం ప్రాజెక్టులలో పేరుకుపోయిన పూడికపై దృష్టిపెట్టాలని రైతులు కోరుతున్నారు. ప్రాజెక్టులలో పేరుకుపోయిన పూడికపై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో నీటి కోసం మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories