పుట్టపర్తిలో పట్టు నిలుపుకునేదెవరు...పల్లె రఘునాథ రెడ్డి హ్యాట్రిక్ కొడతాడా?

పుట్టపర్తిలో పట్టు నిలుపుకునేదెవరు...పల్లె రఘునాథ రెడ్డి హ్యాట్రిక్ కొడతాడా?
x
Highlights

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో గెలుపు ఎవరిది బాబా ఆశీస్సులు ఎవరికున్నాయ్ చిత్రావతి నదీమ తల్లి చెంతన సేదతీరునున్నది ఎవరు పల్లె...

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో గెలుపు ఎవరిది బాబా ఆశీస్సులు ఎవరికున్నాయ్ చిత్రావతి నదీమ తల్లి చెంతన సేదతీరునున్నది ఎవరు పల్లె రఘునాథ రెడ్డి హ్యట్రిక్ విజేతగా నిలుస్తారా వైఎస్‌ఆర్ సీపీ బోనీ కొట్టబోతోందా పుట్టపర్తిలో ఏం జరిగింది ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు?

ప్రపంచానికి శాంతిని పంచిన భగవాన్ సత్యసాయి బాబా నడియాడిన గడ్డ. ఆధ్యాత్మిక కేంద్రంగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతున్న ప్రాంతం. ఫ్యాక్షన్ మూలాలు ఉన్న అనంతపురంలో ప్రశాంతతకు మారు పేరుగా నిలిచిన నేల పుట్టపర్తి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే పుట్టపర్తిలో ఎన్నికల నిర్వహణ ప్రశాంతమే. సైలెంట్ ఓట్ ఎటువైపు మల్లింది 2009, 2014లో వరుసగా గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పల్లె రఘునాథ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారా ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ, పుట్టపర్తిలో బోనీ కొట్టబోతోందా అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

పుట్టపర్తి నియోజకవర్గంలో పుట్టపర్తి పట్టణంతో పాటు పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, ఓబుళదేవర చెరువు, నల్లమాడ, ఆమడగూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 1,99,675 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 99,953, స్త్రీలు 99,710, ఇతరులు 12 మంది ఉన్నారు. ఎన్నికల్లో 85.37 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 81.59 శాతం పోలింగ్ రికార్డయితే, ఈ ఎన్నికల్లో 3.78 శాతం పోలింగ్ పెరిగింది.

2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పల్లె రఘునాథ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ తరఫున సోమశేఖర్ రెడ్డి బరిలో నిలిచారు. సోమశేఖర్ రెడ్డిపై పల్లె రఘునాథ రెడ్డి 6964 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి నవ్యాంధ్ర తొలి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. అనంతరం జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా పల్లె రఘునాథ రెడ్డి మరో పదవిలోకి మారారు.

పల్లె రఘునాథ రెడ్డితో పాటు ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు క్రిష్ణకిషోర్, కోడలు సింధూర నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అసమ్మతి నేతలను బుజ్జగిస్తూ పార్టీ కార్యకర్తలను ఏకతాటిపై తీసుకురావడంతో ఎంతోకొంత సఫలమయ్యానని భావించారు పల్లె.

అటు పల్లె రఘునాథరెడ్డికి దీటుగా వైసీపీ నేత దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో తమదైన శైలిలో ప్రచారం సాగించారు. దిద్దుకుంట ఫౌండేషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు సరఫరా చేయడంతో పాటు పలు సేవాకార్యక్రమాలు చేపడుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేశారు. పార్టీ నేతలు, క్యాడర్ ను ఏకతాటిపై నడిపంచి ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

నియోకవర్గంలో ముందు నుంచి కొన్ని మండలాల్లో టీడీపీకి పట్టుంది. పుట్టపర్తి అర్బన్, రూరల్‌తో పాటు కొత్త చెరువు మండలంలో టీడీపీకి బలముంది. గత ఎన్నికల్లో వీటితో పాటు ఓబుళదేవర చెరువులోనూ టీడీపీకి మెజార్టీ వచ్చింది. ఈ మండలాల్లో తమకు మంచి మెజారిటీ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు పల్లె రఘునాథ రెడ్డి.

నల్లమాడ, బుక్కపట్నం మండలాల్లో వైసీపీకి ముందు నుంచి పట్టుంది. ఈసారి పుట్టపర్తి అర్బన్, రూరల్‌తో పాటు ఓడీసీ, కొత్త చెరువు మండలాల్లో వైసీపీ పుంజుకుందని, అత్యధికంగా ఓట్లు వైసీపీకి పడ్డాయని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, టీడీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలతో ఓటర్లు తమ వైపు మొగ్గారని చెబుతున్నారు. టీడీపీ మాత్రం గెలుపు పై దీమా వ్యక్తం చేస్తోంది. పార్టీ క్యాడర్చ గ్రామాలతో పాటు పట్టణంలోనూ పటిష్టంగా ఉందని, ప్రధానంగా మహిళల ఓట్లు టీడీపీకి అధికంగా పడ్డాయని లెక్కలేస్తున్నారు. గత ఎన్నికల కంటే కొంత మెజార్టీ తగ్గినా అంతిమంగా విజయం తమదే అన్న కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. పుట్టపర్తిలో అంతిమంగా ఎవరు విజయం సాధించినా తక్కువ మెజార్టీతో బయటపడతారన్న ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories