తోడల్లుడిని బాబు అధ్యక్షా అనాల్సిందేనా ?

తోడల్లుడిని బాబు అధ్యక్షా అనాల్సిందేనా ?
x
Highlights

మరో ఐదు రోజుల్లో ఎన్నికల ఫలితాలకు తేరలేవనుంది . ఫలితాలకు ముందే విజయం మాదంటే మాదే అన్నట్టుగా ఏపిలోని అన్ని పార్టీలు మంచి ధీమాతో ఉన్నాయి . ఇందులో జనసేన...

మరో ఐదు రోజుల్లో ఎన్నికల ఫలితాలకు తేరలేవనుంది . ఫలితాలకు ముందే విజయం మాదంటే మాదే అన్నట్టుగా ఏపిలోని అన్ని పార్టీలు మంచి ధీమాతో ఉన్నాయి . ఇందులో జనసేన కొంచం సైలెంట్ గా ఉంటే వైసీపీ మాత్రం పిచ్చ దూకుడుని ప్రదర్శిస్తుంది . ఇప్పటికే జగన్ కాబోయే సీఎం అని నేమ్ ప్లేట్ కూడా రెడీ చేసి పెట్టారు .. ఇదే కాకుండా జగన్ సీఎం అయితే ఆయన క్యాబినెట్ ఇదేనంటూ ఓ లిస్టు కూడా సోషల్ మీడియాలోకి వదిలారు .. ఇప్పుడు అ లిస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కానీ అ లిస్టు మరో ఆసక్తికరమైన చర్చకి దారి తీసింది..

జగన్ సీఎం అయితే అయన క్యాబినెట్ లో దగ్గుపాటి వెంకటేశ్వర రావు స్పీకర్ అని అ లిస్టు లో ఉంది . అనుకున్నట్టుగా వైసీపీ అధికారంలోకి వస్తే దగ్గుపాటి స్పీకర్ అయితే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఆయనని గౌరవంగా అధ్యక్షా అని పిలవాల్సి ఉంటుంది.. ఇలా ఒక్కసారి కాదు ఐదు సంవత్సరాలు ఇలాగే పిలవాలి .. రాష్ట్ర విభజన తర్వాత దగ్గుపాటి రాజకీయాలకు సైలెంట్ గా ఉన్నారు. అయన భార్య పురందరేశ్వరి బీజేపిలో చేరారు .

దగ్గుపాటి దంపతుల కుమారుడు హితేష్ చెంచురామ్ ని వైసీపీ తరుపున పరుచూరి నుండి ముందు పోటి చేయించాలని భావించారు . కానీ అనుకోని కారణాల వల్ల దగ్గుపాటి వెంకటేశ్వర రావు పోటి చేయాల్సి వచ్చింది.. ఇప్పుడు అనుకోకుండా దగ్గుపాటి వైసీపీ అభ్యర్ది అయ్యారు . ఇప్పుడు కూడా అనుకోకుండానే వచ్చిన ఈ అవకాశం మరో అంశానికి దారి తీస్తుందని ఎవరు అనుకోని ఉండరు కదా .. ఫలితాలు రాకముందే వైసీపీ ఇలా లెక్కలు వేసుకోవడం వల్ల భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి .

Show Full Article
Print Article
Next Story
More Stories