Top
logo

డేటా వార్‌‌పై టీకాంగ్రెస్‌ ఎందుకు నోరు మెదపడం లేదు

డేటా వార్‌‌పై టీకాంగ్రెస్‌ ఎందుకు నోరు మెదపడం లేదు
X
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు అయ్యాయంటూ ఉద్యమించారు. ఎలక్షన్ కమిషన్‌ దగ్గర్నుంచి న్యాయస్థానాల వరకు ...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు అయ్యాయంటూ ఉద్యమించారు. ఎలక్షన్ కమిషన్‌ దగ్గర్నుంచి న్యాయస్థానాల వరకు అందర్నీ ఆశ్రయించారు. టీఆర్ఎస్సే ఓట్లు తొలగించిందంటూ మిత్రపక్షం టీడీపీతో కలిసి ఫిర్యాదులు చేశారు. మరి ఇప్పుడదే ఇష్యూపై తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ జరుగుతుంటే టీకాంగ్రెస్‌ ఎందుకు సైలెంట్‌గా ఉంది? జాతీయ స్థాయిలో చంద్రబాబు మిత్రపక్షంగా ఉన్నా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎందుకు నోరు విప్పడం లేదు?. డేటా చోరీ వ్యవహారంపై అన్ని పార్టీలూ స్పందిస్తున్నా టీకాంగ్రెస్‌ మాత్రం ఎందుకు మౌనవ్రతం పాటిస్తోంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు అయ్యాయంటూ పోరాటం చేసిన తెలంగాణ కాంగ్రెస్‌ ఇప్పుడదే ఇష్యూపై తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్‌ జరుగుతుంటే సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది. మిత్రపక్షం తెలుగుదేశానికి సపోర్ట్‌గా ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. తమకేమీ సంబంధం లేదన్నట్లుగా మౌనవ్రతం పాటిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు చేసే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చారంటూ ఏపీ టీడీపీ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నా వాళ్లకు మద్దతుగా స్పందించేందుకు వెనుకాడుతున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయామన్న భావనతో టీకాంగ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తెలుగుదేశానికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడటానికి సాహసించడం లేదని అంటున్నారు. ఇప్పటికే టీడీపీతో జతకట్టి చేతులు కాల్చుకున్నామని, ఇప్పుడు తెలుగుదేశానికి సపోర్ట్‌గా మాట్లాడితే పార్లమెంట్‌ ఎన్నికల ముందు ఆ బురద తమకు ఎక్కడ అంటుకుంటుందోనని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది.


Next Story