త్రిముఖ పోటీలో సత్తా చాటేదెవరు?

త్రిముఖ పోటీలో సత్తా చాటేదెవరు?
x
Highlights

కాకినాడ కాజా. నోరూరించే స్వీట్ మజా. అయితే ఈసారి కాకినాడ సిటీ సెగ్మెంట్‌ మాత్రం, ఎవరికి స్వీటు తినిపిస్తుందో ఎవరికి నాటు రుచి చూపిస్తుందో ఎవ్వరికీ...

కాకినాడ కాజా. నోరూరించే స్వీట్ మజా. అయితే ఈసారి కాకినాడ సిటీ సెగ్మెంట్‌ మాత్రం, ఎవరికి స్వీటు తినిపిస్తుందో ఎవరికి నాటు రుచి చూపిస్తుందో ఎవ్వరికీ అర్థంకావడం లేదు. ఎందుకంటే అక్కడ జనసేన ప్రధాన అభ్యర్థుల గుండెల్లో దడపుట్టిస్తోంది ఇంతకీ కాకినాడ పొలిటికల్ తీరంలో లంగరేసేది ఎవరు?

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో, ఈసారి ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. తెలుగుదేశం, వైసీపీ, జనసేనల పోటీతో, ట్రయాంగిల్‌ వార్‌ రసవత్తరంగా సాగింది.

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు వనమాడి వెంకటేశ్వర రావు. ఈయను స్థానికంగా అందరూ కొండబాబు అని పిలుచుకుంటారు. వైసీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీలో నిలిచారు.

ఇక వీరిద్దరికీ గట్టి పోటీనిస్తున్న మూడో వ్యక్తి మాజీ మంత్రి గోపాల్ కృష్ణ తనయుడు ముత్తా శశిధర్. జనసేన నుంచి సై అన్నారు. ఈ ముగ్గురి మధ్య త్రిముఖపోటీ నువ్వానేనా అన్న రీతిలో సాగింది.

కాకినాడ బ్రిటిష్ కాలం నుంచి నౌకాయాన పారిశ్రామిక శ్రామికవాడగా ఉండేది. అందుకే ఇక్కడ 1952లో జరిగిన తొలి ఎన్నికలలో కమ్యూనిస్టు అభ్యర్థిగా సి.వి. కె రావు ఎన్నికయ్యారు. అదే ఒరవడి కొనసాగిస్తూ ఆయన మరో రెండు పర్యాయాలు ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. కాకినాడ సిటీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో సామాజిక సమీకరణలు అత్యంత కీలకం. మత్స్యకార వర్గాలకు పెట్టనికోట కాకినాడ. అందుకే స్వామి రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వనమాడి కొండబాబు రెండుసార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం మూడో పర్యాయం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు వనమాడి కొండబాబు.

అలాగే కాపులు సైతం కాకినాడలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఆ తర్వాత ఎస్సీలు, బీసీలు. అందుకే జనసేన అభ్యర్థి నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుడుతోంది. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ తనయుడు ముత్తా శశిధర్‌ జనసేన నుంచి రంగంలోకి దిగారు. జనసేన టీడీపీ ఓట్లు చీలుస్తుందా లేదంటే వైసీపీకి గండికొడుతుందా రెండు పార్టీలనూ కాదని తానే జెండా ఎగరేస్తుందా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. చూడాలి పెన్షనర్స్‌ ప్యారడైజ్ కాకినాడ సిటీలో ఏ పార్టీ విజయబావుటా ఎగరేస్తుందో.


Show Full Article
Print Article
Next Story
More Stories