ఎవరా ఇద్దరు?

ఎవరా ఇద్దరు?
x
Highlights

గత కేబినెట్‌లో మహిళలు లేకపోవడంపై ఎన్ని విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోని ముఖ‌్యమంత్రి కేసీఆర్ ఈసారి పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. త్వరలో జరగబోయే...

గత కేబినెట్‌లో మహిళలు లేకపోవడంపై ఎన్ని విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోని ముఖ‌్యమంత్రి కేసీఆర్ ఈసారి పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మహిళల పట్ల తమకు అత్యంత గౌరవముందన్న కేసీఆర్‌ మహిళా ఓటర్ల అండతోనే బంపర్ మెజారిటీతో తాము రెండోసారి అధికారంలోకి వచ్చామన్నారు.

మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరడంతో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకరికి కాదు ఇద్దరికి చోటు కల్పిస్తామని ప్రకటించారు. మహిళలంటే తమకు నిర్లక్ష్యం లేదని, అందుకే ఎమ్మెల్సీ సీట్లలోనూ ఒకటి కేటాయించినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, రేఖానాయక్‌, గొంగిడి సునీతతోపాటు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఆకుల లలిత‌... కేబినెట్‌ రేసులో ఉన్నారు. అయితే ఈ ఐదుగురిలో ఎవరిని అమాత్య పదవి వరిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories