గెలుపుపై అంత కాన్ఫిడెన్స్ ఏంటి...ఏపీ ఎవరిది?

గెలుపుపై అంత కాన్ఫిడెన్స్ ఏంటి...ఏపీ ఎవరిది?
x
Highlights

నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిసింది. ఐదేళ్ల క్రితం ముగిసిన ఎన్నికలను మించి పోలింగ్ శాతం నమోదయ్యింది. అనూహ్యంగా పెరిగిన ఈఓట్ల శాతం పై...

నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిసింది. ఐదేళ్ల క్రితం ముగిసిన ఎన్నికలను మించి పోలింగ్ శాతం నమోదయ్యింది. అనూహ్యంగా పెరిగిన ఈఓట్ల శాతం పై అధికార, ప్రతిపక్షపార్టీలు తమకు అన్వయించుకొంటూ గెలుపు తమదంటే తమదే నంటూ బీరాలు పలుకుతున్నాయి. ఇంతకూ పెరిగిన ఓటింగ్ శాతం ఏపార్టీకి వరం, ఏపార్టీకి శాపం.

నవ్యాంధ్రప్రదేశ్ రెండోఎన్నికల్లో పోలింగ్ పర్వం ముగిసింది. రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్ల క్రితం ముగిసిన తొలిఎన్నికలను మించి ప్రస్తుత 2019 ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదయ్యింది. 2014 ఎన్నికల్లో 77. 96 ఓటింగ్ శాతం నమోదైతే ప్రస్తుత ఎన్నికల్లో 80 శాతం వరకూ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే గత ఎన్నికలను మించి అధికంగా పోలైన ఈ ఓట్ల శాతం తమకే అధికారం కట్టబెడుతుందని అధికార టీడీపీ అంటుంటే ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు, గెలుపు తమదేనని ప్రతిపక్ష వైసీపీ ధీమాగా చెబుతోంది.

సాధారణంగా ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైతే అది ప్రభుత్వ వ్యతిరేకఓటుగా భావించడం ఓ సాంప్రదాయంగా వస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికల్లో అదే జరిగింది. అయితే ఇటీవలే ముగిసిన తెలంగాణా, గతంలో ముగిసిన కర్ణాటక, బీహార్, ఒడిషా రాష్ట్రాలలో మాత్రం ప్రభుత్వ సానుకూల ఓటుగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఎన్నికల్లో నమోదైన భారీ ఓటింగ్ తో తమ గెలుపు ఖాయమని, ఆడపడుచులు తమ పార్టీనే గెలిపించబోతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతతోనే భారీ ఓటింగ్ నమోదయ్యిందని తాము ఆధికారంలోకి రావడం ఖాయమని ప్రతిపక్ష నేత జగన్ ధీమాగా చెబుతున్నారు.

అంతేకాదు బాబుకు ఓటమి భయం పట్టుకొందని వైసీపీ నేత అంబటి రాంబాబు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీ ఓటింగ్ తో చంద్రబాబు ప్రభుత్వానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించారని, ఏపీకి పట్టిన చంద్రగ్రహణం వీడటం ఖాయమని వైసీపీ మరోనేత బొత్సా చెబుతున్నారు. మొత్తం మీద ఇటు టీడీపీ అటు వైసీపీ ఏపీలో నమోదైన భారీ పోలింగ్ శాతాన్ని తమ విజయానికి అన్వయించుకొంటూ గాల్లో తేలిపోతున్నారు. ఏపార్టీకి పాజిటివ్ ఏ పార్టీకి నెగిటివ్ అన్నది తెలుసుకోవాలంటే మరో 40 రోజులపాటు ఎదురుచూడక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories