logo

ఫ్రంట్‌ను నడిపించే లీడర్ ఎవరు? దీదీనా.. బాబునా?.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత, నిజంగా జనహోరును తలపించింది. ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. అందరి నాయకులదీ ఒకే నినాదం. అదే మోడీ హఠావో. అన్ని పార్టీలది గొంతుక. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఇసుకేస్తే రాలనంతగా హోరెత్తిన బ్రిగేడ్‌ మైదానంలో, దేశంలో ఉద్దండ నాయకులందరూ, సమైక్య రాగం వినిపంచారు.

ఫ్రంట్‌ను నడిపించే లీడర్ ఎవరు? దీదీనా.. బాబునా?.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత, నిజంగా జనహోరును తలపించింది. ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. అందరి నాయకులదీ ఒకే నినాదం. అదే మోడీ హఠావో. అన్ని పార్టీలది గొంతుక. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఇసుకేస్తే రాలనంతగా హోరెత్తిన బ్రిగేడ్‌ మైదానంలో, దేశంలో ఉద్దండ నాయకులందరూ, సమైక్య రాగం వినిపంచారు. లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. విపక్ష నాయకులు ఐక్యత చాటుకున్నారు సరే. కానీ చీలికలు, పేలికలుగా ఉండి, ఇప్పటికప్పుడు ఏకమైన, ఏకమైనట్టుగా కనిపిస్తున్న పార్టీలన్నింటినీ ముందుండి నడిపించేదెవరు.? మోడీకి దీటైన నాయకుడిగా ముందుపెట్టేదెవరు? ప్రధాని అభ్యర్థిగా ఉండేదెవరు, రాహుల్‌ నాయకత్వాన్ని బలపరిచేదెవరు. మహాకూటమిగా ఏర్పడిన విపక్ష పార్టీలకు ఇటివల కాలంలో కాషాయం నేతల నుండి అందరి నేతల నుంచి వచ్చే మొదటి ప్రశ్నఇదే. కాని వీటన్నింటికి కూటమి నేతల వద్ద సమాధానం లేదు. బహుశా ఎన్నికల అయిపోయే వరకు, ఇదే గందరగోళం కంటిన్యూ అవ్వడం ఖాయం. ఫలితాలు వచ్చాక, ఎవరికెన్ని సీట్లు వచ్చాయో తేలాక, వారివారి బలాన్ని బట్టి అప్పుడున్న బీజేపీ, కాంగ్రెస్‌ శక్తిని బట్టి, వారి బలహీనతలను బట్టి, అదనుచూసి, పాచిక వేసేందుకు, లోలోపల చాణక్యవ్యూహం రెడీ చేసుకునే ఉన్నారు నాయకులు. కానీ ఇప్పుడు బయటపడరు. అదే కూటమి ముందున్న సవాలు. మమతా బెనర్జీ, మోడీ పాలనపై విరుచుకుపడ్డారు. ప్రాంతీయ పార్టీలను కబళించే కుట్రలు ఇక ఎంత మాత్రమూ సాగవని, బీజేపీని ఓడించడమే కాకుండా మూలాలతో పెకిలించాలని పిలుపునిచ్చారు మమతా. కాగా రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని గళమెత్తారు చంద్రబాబునాయుడు. మోడీ ఫెర్మానెన్స్ ప్రైమ్ మినిస్టర్ కాదు, పబ్లిసిటీ పీఎం అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరి వీరిలో నడిపించే నాయకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

లైవ్ టీవి

Share it
Top