రాజంపేట రాజెవరు...?

రాజంపేట రాజెవరు...?
x
Highlights

రాజంపేట రాజసం దక్కేదెవరికి...? టీడీపీ నుంచి గెలిచిన మేడా వైసీపీలోకి జంప్ అవడంతో ఇక్కడ పోటీపై ఆసక్తి నెలకొంది. వైసీపీ మేడాకు లైన్ క్లియర్ చేయగా టీడీపీ...

రాజంపేట రాజసం దక్కేదెవరికి...? టీడీపీ నుంచి గెలిచిన మేడా వైసీపీలోకి జంప్ అవడంతో ఇక్కడ పోటీపై ఆసక్తి నెలకొంది. వైసీపీ మేడాకు లైన్ క్లియర్ చేయగా టీడీపీ బత్యాల పేరు ఖరారు చేసింది. బత్యాల సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని పోటీకి నిలపబోతోంది జనసేన. దీంతో రాజంపేట రాజకీయం రసవత్తరంగా మారింది.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 2014 ఎన్నికల్లో జిల్లా అంతా వైసీపీ అభ్యర్థులు గెలవగా ఒక్క రాజంపేట నుంచి మాత్రం టీడీపీ అభ్యర్థిగా మేడా మల్లికార్జునరెడ్డి గెలుపొందారు. అతనికి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చింది టీడీపీ. మేడాకు అసమ్మతి వర్గం తయారవడంతో వైసీపీలో చేరారు మేడా.

మేడా వైసీపీలో చేరికను రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు అకేపాటి అమర్ నాథ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. జగన్‌తో భేటీ తర్వాత అమర్‌నాథ‌ రెడ్డి శాంతించారు. రానున్న ఎన్నికల్లో టికెట్ తనకు దక్కేలా చేసుకున్నారు మేడా మల్లికార్జున రెడ్డి. పార్టీ నేతల్లో ఉన్న అసమ్మతిని చాకచక్యంతో దారికి తెచ్చుకున్న మేడాకు క్యాడర్ ఏమేరకు అనుకూలంగా పని చేస్తుందోననే ప్రశ్న తలెత్తుతుంది.

టీడీపీ ప్రతి ఎన్నికలో తాత్కాలిక అవసరం తీరేలా అభ్యర్థులను ఎంపిక చేస్తుండటంతో పార్టీకి అంతగా పట్టులేకుండాపోయింది. ఈసారి పార్టీ ఫిరాయించిన మల్లికార్జున రెడ్డిని ఓడించే లక్ష్యంతో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలనే పట్టుదలతో పార్టీ ఉంది. పలువురి పేర్లు తెరపైకి వచ్చినా అధిష్టానం బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాల చెంగల్రాయులు పేరును ఖరారు చేశారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటంతో బత్యాల వైపు పార్టీ మొగ్గు చూపింది.

జన సేన పార్టీ నుంచి కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆశావహులు తెరపైకి వచ్చారు. జనసేన తరపున ఎన్.ఆర్.ఐ మలిశెట్టి వెంకటరమణ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇక్కడ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం వీరి గెలుపు ఓటములు ఎలా ఉంటాయనేది హాట్ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories