ఏపీ డీజీపీని మార్చేయోచనలో ఎన్నికల కమిషన్

ఏపీ డీజీపీని మార్చేయోచనలో ఎన్నికల కమిషన్
x
Highlights

డేటా వార్‌, ఓట్ల తొలగింపు, బోగస్ ఓటర్లతో వేడెక్కిన ఏపీ రాజకీయాల్లో మరో పరిణామాం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ డీజీపీగా ఉన్న ఆర్పీ...

డేటా వార్‌, ఓట్ల తొలగింపు, బోగస్ ఓటర్లతో వేడెక్కిన ఏపీ రాజకీయాల్లో మరో పరిణామాం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను మార్చే యోచనలో ఈసీ ఉన్నట్టు సమాచారం. డీజీపీపై వ్యవహారశైలిపై ప్రతిపక్ష వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపధ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత డీజీపీ మార్పుపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇదే అంశం ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

డీజీపీని తొలగించాలని దాదాపు నిర్ణయానికి వచ్చిన కేంద్ర ఎన్నికల తరువాత సీనియార్టీలో ఉన్న అధికారుల పేర్లను పరిశీలిస్తోంది. ఇందులో సీనియర్ అధికారులు కౌముది, గౌతమ్ సవాంగ్‌లతో పాటు ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు పేర్లను పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. ఆర్పీ ఠాకూర్ తరువాత అత్యంత సీనియర్‌గా ఉన్న అధికారితో పాటు వివాదరహితుడిని ఎంపిక చేయాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. గతంలో 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఏపీ డీజీపీగా ఉన్న ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను తప్పించి సీనియర్ అధికారి మహంతిని నియమించింది. అయితే ఎన్నికలు పూర్తి కాగానే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మహంతిని తొలగించి తిరిగి ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను తిరిగి నియమించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories