కాంగ్రెస్ మేనిఫెస్టోపై స్పందించిన జైట్లీ

కాంగ్రెస్ మేనిఫెస్టోపై స్పందించిన జైట్లీ
x
Highlights

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించడంపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. హోదా కోసం ఇచ్చే డబ్బును కాంగ్రెస్...

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించడంపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. హోదా కోసం ఇచ్చే డబ్బును కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. 14వ ఆర్ధిక సంఘం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామన్న ఆయన హోదాతో సమానమైన ప్యాకేజీ ఇచ్చామన్నారు. ఇందుకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి పంపారంటూ గుర్తు చేశారు. దక్షిణ భారత దేశాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందన్న రాహుల్ వ్యాఖ్యాలకు కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అలా చేసిందేమో అంటూ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories