జవాన్ల కంటే మోడీకి పబ్లిసిటీ ముఖ్యమా...ఉగ్ర దాడి రోజు ప్రధాని ఫొటో షూట్‌పై కాంగ్రెస్‌ ఫైర్‌

జవాన్ల కంటే మోడీకి పబ్లిసిటీ ముఖ్యమా...ఉగ్ర దాడి రోజు ప్రధాని ఫొటో షూట్‌పై కాంగ్రెస్‌ ఫైర్‌
x
Highlights

భారత సైనికుల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చిన పుల్వామా ఉగ్రదాడిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇది కచ్చితంగా నిఘా వైఫల్యమేననీ...

భారత సైనికుల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చిన పుల్వామా ఉగ్రదాడిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇది కచ్చితంగా నిఘా వైఫల్యమేననీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన చేతగానితనాన్ని ఒప్పుకోవాల్సిందేనని దుయ్యబట్టింది. కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బీజేపీ అదే స్థాయిలో తిప్పికొట్టింది.

40 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై ప్రధాని మోదీ కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాంగ్రెస్ మండిపడింది. పుల్వామా ఉగ్రదాడి జరిగిన రోజు ప్రధానమంత్రి తనకేం పట్టనట్టు ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా గడిపారని అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఆరోజు మధ్యాహ్నం పుల్వామా ఉగ్రదాడిలో మన సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై దేశం మొత్తం రోదిస్తుంటే ప్రధాని నరేంద్రమోదీ జిమ్ కార్బెట్ పార్కులో సాయంత్రం వరకు ఓ సినిమా షూటింగ్‌లో బిజిగా గడిపారని సుర్జేవాలా ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపైనా సుర్జేవాలా ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ వైఫల్యాలపై ప్రధాని మోదీ ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నించారు. అంత పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్లు దేశంలోకి ఎలా వచ్చాయని అనుమానం వ్యక్తం చేశారు. ఆ వాహనం దేశంలోకి ఎలా ప్రవేశించిందని ప్రశ్నించారు. దాడి చేస్తామంటూ ఉగ్రవాదులు వీడియో విడుదల చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు.

కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ధీటుగా జవాబిచ్చారు. ఉగ్రదాడిని కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భద్రత పట్ల మోడీకి ఉన్న నిబద్ధతను కాంగ్రెస్ శంకించాల్సిన అవసరం లేదని అమిత్ షా అన్నారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి లో సైనికులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగితేలుతున్న ప్రస్తుత తరుణంలో మన రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories