ఎన్నికల వేళ వాట్సప్ కీలక నిర్ణయం

ఎన్నికల వేళ వాట్సప్ కీలక నిర్ణయం
x
Highlights

ప్రముఖ సోషల్ మీడియాలో ఒకటైనా వాట్సప్ సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సప్ లో చెక్ పాయింట్ టిప్‌లైన్ అనే సరికొత్త సాంకేతి...

ప్రముఖ సోషల్ మీడియాలో ఒకటైనా వాట్సప్ సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సప్ లో చెక్ పాయింట్ టిప్‌లైన్ అనే సరికొత్త సాంకేతి విధాన్నాన్ని మంగళవారం ప్రవేశపెట్టింది. ఇక చెక్‌పాయింట్ టిప్‌లైన్ సాకేంతిక విధానం ద్వారా అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్టవేస్తుంది.

ఇండియాకు చెందిన పీఆర్ఓటీఓ అనే స్టార్టప్ సంస్థ ఆవిష్కరించిన చెక్‌పాయింట్ టిప్‌లైన్ అనే సాంకేతిక విధానంతో వాట్సప్‌లో వచ్చిన సందేశాలను 9643000888కు పంపిచడం ద్వారా అసలు ఆ వార్త నిజమా, కాదా, పుకార్ల అని తెలుసుకోవచ్చని వాట్సప్ వెల్లడించింది. యూజర్స్ పంపే ఫోటోలు, వీడియోలు, సందేశాల్లో అసలు ఎంత వరకు సత్యం, అసత్యం, తప్పుదోవపట్టించేది, వివాదాస్పదమైంది అనే నాలుగు కేటగిరీల ద్వారా విశ్లేంచుకోవచ్చని వెల్లడించింది. అయితే ఈ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం తొందరగా పాకుతుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందికి గురికాకుండా, అసత్య ప్రచారాలు, వదంతులు చెక్ పెట్టేందుకు వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుందని ఆ సంస్థ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories