కశ్మీర్‌లో హైటెన్షన్... సెగలు రేపుతున్న ఆర్టికల్ 35A

కశ్మీర్‌లో హైటెన్షన్... సెగలు రేపుతున్న ఆర్టికల్ 35A
x
Highlights

పుల్వామా ఘటన తర్వాత జమ్మూకశ్మీర్‌లో పరిణామాలఅు వేగంగా మారిపోతున్నాయ్. కాశ్మీరీలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే 35ఎ అధికరణం'పై రేపు సుప్రీంకోర్టు...

పుల్వామా ఘటన తర్వాత జమ్మూకశ్మీర్‌లో పరిణామాలఅు వేగంగా మారిపోతున్నాయ్. కాశ్మీరీలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే 35ఎ అధికరణం'పై రేపు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో వేడి మరింత పెరిగింది. ముందస్తుగా జమ్మూకశ్మీర్‌లో 150 మంది వేర్పాటువాదులను అదుపులోకి తీసుకున్న ప్రభుత్వం కశ్మీర్‌ లోయలో అదనంగా 10 వేల మంది పారా మిలటరీ దళాలను మోహరించింది. ఇంతకీ ఆర్టికల్ 35ఎ ఏం చెబుతోంది..? దానివల్ల కశ్మీరీలకు ఏ ప్రయోజనాలున్నాయి.

జమ్మూకశ్మీర్‌లో శాశ్వత పౌరులను గుర్తించి, వారికి ప్రత్యేక హక్కులను కల్పించే స్వేచ్ఛను రాష్ట్ర అసెంబ్లీకి కల్పించేందుకు '35 ఎ' అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు. దీని పరిధిలో రాష్ట్ర శాసన సభ చేసే ఏ చర్యనూ సవాల్‌ చేయడానికి వీల్లేదు. శాశ్వత హోదా ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి, రాష్ట్రంలో ఆస్తుల కొనుగోలు చేయడానికి, ఉపకార వేతనాలు, ఇతర ప్రభుత్వ సాయం, సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులు. ఇతర ప్రాంతాల వారు వీటికి అనర్హులు. ఇతర రాష్ట్రాల వారిని వివాహం చేసుకున్న స్థానిక మహిళలు కూడా ఇక్కడ ఆస్తి హక్కును కోల్పోవాల్సి ఉంటుంది. ఇలాంటి మహిళల వారసులకూ ఇది వర్తిస్తుంది.

1954లో నెహ్రూ కేబినెట్‌ సలహా మేరకు నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ ఈ మేరకు రాజ్యాంగంలో ఈ అధికరణను చేరుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే పార్లమెంటు ఆమోదం లేకుండా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఈ అధికరణాన్ని చేర్చడంపై మొదటి నుంచీ వివాదం రగులుతూనే ఉంది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణం కింద ఈ మార్పును చేపట్టారు. అయితే 370 అధికరణం తాత్కాలికమేనని, దాని ద్వారా మరిన్ని హక్కులు కల్పించడం సరికాదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుప్రీం తుది నిర్ణయం ప్రకటించబోతోంది.

జమ్మూకశ్మీర్‌లో స్థానికులకు ప్రత్యేక హక్కులు కల్పించే '35ఎ అధికరణం'పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రభుత్వం వేర్పాటు వాదులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దాదాపు 150 మంది వేర్పాటువాదులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంది. రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.

శాంతి భద్రతలు అదుపు తప్పకుండా కశ్మీర్‌ లోయలోకి అదనంగా 100 కంపెనీల పారామిలటరీ బలగాలను వాయుమార్గంలో తరలించింది. అయితే, నాయకుల నిర్బంధాన్ని నిరసిస్తూ వేర్పాటువాద సంస్థల కూటమి జాయింట్‌ రెసిస్టెన్స్‌ లీడర్‌షిప్‌ కశ్మీర్‌ లోయలో బంద్‌కు పిలుపునిచ్చింది. 35ఎ అధికరణంపై విచారణ జరగడానికి ముందు జరుగుతున్న ఈ దాడులు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories