logo

చలిగుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాలను చలి పులి గజగజలాడిస్తోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో ఏళ్లనాటి రికార్డులు బద్దలవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలులతో గడ్డకట్టుకుపోతోంది.

weather reportweather report

తెలుగు రాష్ట్రాలను చలి పులి గజగజలాడిస్తోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో ఏళ్లనాటి రికార్డులు బద్దలవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలులతో గడ్డకట్టుకుపోతోంది. గత వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జిల్లాలోని భీంపూర్ మండలం అర్లి-టి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున 2.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2017 డిసెంబరులో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈసారి అంతకంటే పడిపోవడం గమనార్హం. మెదక్‌లో కనిష్టంగా 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

విశాఖ ఏజెన్సీలో చలి గజ గజ వణికిస్తోంది. విశాఖలో 50ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగిలో కనిష్టంగా 1 డిగ్రీ ఉష్ణోగ్రత, చింతపల్లిలో 1.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.విశాఖలో రాత్రి 12.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో నాలుగైదు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

లైవ్ టీవి

Share it
Top