కలెక్టర్ ,రెవెన్యూ శాఖ పేర్లను మార్చాలి..: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

కలెక్టర్ ,రెవెన్యూ శాఖ పేర్లను మార్చాలి..: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
x
Highlights

పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. పేదవాడి కూడు,గూడుకు భరోసా కల్పించడంలో టీఆర్ఎస్...

పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. పేదవాడి కూడు,గూడుకు భరోసా కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలమైందన్నారు. సామాజిక బాధ్యతగా పించన్లను రెట్టింపు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గిరిజన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్‌‌ శవవేగంగా అభివృద్ధి సాధించాలనే మహోన్నత లక్ష్యంతో నాలుగు జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే జులై తర్వాత ప్రతి జిల్లాకు వెళ్లి ప్రజాదర్బార్ ఏర్పాటుచేస్తామని దానికి తానే స్వయంగా ప్రజల సమస్యను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇక రెవెన్యూశాఖ, కలెక్టర్ పేర్లును మార్చాల్సి ఉందన్నారు కేసీఆర్. అవి బ్రిటిష్ హయాం నాటి పేర్లని కలెక్షనే లేనప్పుడు కలెక్టర్ పేరెందుకని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories