మా లెక్క రైటు..బీజేపీ ఔటు..: అఖిలేష్

మా లెక్క రైటు..బీజేపీ ఔటు..: అఖిలేష్
x
Highlights

యూపీలో రానున్న ఎన్నికలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారింది. ఇటివలే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కాగా ఈ పొత్తు నుండి బయటకు వచ్చాయి ఎస్పీ, బీఎస్పీ పార్టీలు.

యూపీలో రానున్న ఎన్నికలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారింది. ఇటివలే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కాగా ఈ పొత్తు నుండి బయటకు వచ్చాయి ఎస్పీ, బీఎస్పీ పార్టీలు. ఈ రెండు పార్టీలు మరో కూటమిగా జతకట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ పొత్తుపై నేడు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సెటర్లు కూడా వేశారు. అయితే ఈ నేపథ్యంలో యూపీలో మాయవతితో కలిసి శనివారం సంయక్త ప్రకటన చేయనున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నేడు మీడియా ముందుకు ప్రత్యేక్షమయ్యాడు. మీడియాతో మాట్లాడుతూ ఇటివల జరిగిన ఉప ఎన్నికల్లో మేము (ఎస్పీ, బీఎస్పీ) కలిసి ముందుకు వెళ్లాం. ప్రస్తుత యూపీ సీఎం యోగి, డిప్యూటి సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఖాళీ చేసిన చోటనే బీజేపీ పార్టీ సీట్లు కోల్పోయింది. అదే మాదిరిగా ఈ సారి కూడా మాలెక్కలు సర్గానే ఉండబోతున్నాయి. ఈసారి బీజేపీ ఓటమి ఖాయం అని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఎస్పీ, బీఎస్పీ పార్టీల కలిసి ఉంటే ఇటు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు. మా కూటమితో కాంగ్రెస్ తలుపులు మూతపడినట్టేనని అశిలేష్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories