సునీత అప్పుడేం మాట్లాడారు? ఇప్పుడేం మాట్లాడిస్తున్నారు?: సీఎం రమేష్

సునీత అప్పుడేం మాట్లాడారు? ఇప్పుడేం మాట్లాడిస్తున్నారు?: సీఎం రమేష్
x
Highlights

ఎలాంటి ఫిర్యాదులు లేని కడప ఎస్పీ, ఇంటెలిజెన్స్‌ డీజీని ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన...

ఎలాంటి ఫిర్యాదులు లేని కడప ఎస్పీ, ఇంటెలిజెన్స్‌ డీజీని ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇంటెలిజెన్స్‌ డీజీని ఈసీ మార్చడం చరిత్రలో ఎక్కడా లేదన్నారు. వైసీపీ, బీజేపీ ఒకరి తర్వాత ఒకరు వెళ్లి ఈసీని కలవగానే అధికారులను బదిలీ చేశారని ఆరోపించారు. ఫిర్యాదులు అందితే విచారణ లేకుండా ఎలా బదిలీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. వివేకా కుమార్తె వ్యాఖ్యల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయని, తొలిరోజు వివేకా కుమార్తె సునీత మీడియాతో మాట్లాడుతూ.. 'నిష్పక్షపాత విచారణ కావాలి. రాజకీయ నేతలు కానీ ఎవ్వరూ మాట్లాడొద్దు'అని పేర్కొన్నారు. ఆ తరువాత ఆమెతో హైదరాబాద్, ఢిల్లీలో ఏ విధంగా మాట్లాడించారు? మళ్లీ ఈ రోజు ఏవిధంగా ఆమెతో మాట్లాడిస్తున్నారనేది మనం గమనించాలి. ఆమెపై ఒత్తిడి తేవడంతోనే మరోరకంగా మాట్లాడుతున్నారని సీఎం రమేష్ చెప్పారు. రోజుకు ఒకరకంగా సునీత మాట్లాడటమే ఇందుకు నిదర్శనమన్నారు. వివేకానందరెడ్డి హత్యా ఘటన నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రమేష్ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories