ఇండో-పాక్ సరిహద్దుల్లో వార్ సైరన్...పలు చోట్ల బాంబులు వేసిన పాకిస్థాన్ జెట్ ఫైటర్స్

ఇండో-పాక్ సరిహద్దుల్లో వార్ సైరన్...పలు చోట్ల బాంబులు వేసిన పాకిస్థాన్ జెట్ ఫైటర్స్
x
Highlights

వార్ సైరన్ మోగింది. భారత పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు ఆవరించాయి. నిన్నటి వైమానికి దాడులతో తీవ్ర అసహనంతో ఉన్న పాకిస్తాన్ దుస్సాహసం చేసింది. 3 యుద్ధ...

వార్ సైరన్ మోగింది. భారత పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు ఆవరించాయి. నిన్నటి వైమానికి దాడులతో తీవ్ర అసహనంతో ఉన్న పాకిస్తాన్ దుస్సాహసం చేసింది. 3 యుద్ధ విమానాలను మన మన గగన తలంలోకి పంపింది. అంతేకాదు మన భూభాగంలో బాంబులు జారవిడిచింది. పాకిస్థాన్ గగనతట చొరబాటుకు భారత్ ధీటుగా జవాబిచ్చింది. పాకిస్తాన్‌కు చెందిన F-16 యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ దాటి నౌషెరా, రాజౌరీ సెక్టార్‌లోకి చొరబడగా దానికి పసిగట్టిన భారత వైమానిక దళం పాక్ జెట్ ఫైటర్స్‌పై కాల్పులు జరిపింది. భారత వైమానిక దళం కాల్పుల్లో పాక్ యుద్ధ విమానం ఒకటి నేలకూలింది.

నిన్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్తాన్‌లోని బాలాకోట్ పై భారత వైమానికి దళం భీకర బాంబు దాడులు చేయడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నిన్న సాయంత్రం నుంచి వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. యుద్ధానికి రెడీ అనే సంకేతాలు ఇస్తున్న పాక్ ఇర్మీ ఇప్పుడు గగనతల ఉల్లంఘనకు పాల్పడింది. 3 యుద్ధ విమానాలను భారత గగనతలంలోకి ప్రవేశించగా భారత సుఖోయ్ -30 విమానాలు ఓ పాక్ జైట్ ఫైటర్‌ను కూల్చి వేశాయి. పీఓకేకి 3 కిలో మీటర్ల దూరంలోని లాయ్ వ్యాలీలో పాక్ యుద్ధ విమానం కుప్పకూలింది. కూలుతున్న విమానం నుంచి పాకిస్థాన్ పైలెట్ తప్పించుకున్నాడు. మన గగనతలంలోకి ప్రవేశించిన మిగతా 2 పాకిస్తాన్ యుద్ధవిమానాలు తోకముడిచి స్వదేశానికి జారుకున్నాయి.

భారత ఆర్మీ దెబ్బకు తిరుగుటపా కట్టిన పాకిస్తాన్ ఆర్మీ తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పుకొచ్చింది. పీఓకేలో ఒకటి, జమ్ము కశ్మీర్‌లో మరో భారత యుద్ధవిమానాన్ని కూల్చి వేసినట్లు ప్రకటించుకుంది. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలను కూడా విడుదల చేసింది. అయితే విమానాలు కూలిన చిత్రాలు 2016‌లో జోద్‌పూర్ లో కూల్చినవని తెలిపింది.

పాకిస్థాన్ యుద్ధ ఘంటికలు మోగించడంతో మనదేశం అప్రమత్తమైంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వేర్వేరుగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీకి జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోవల్ పరిస్థితిని వివరించారు. త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అత్యవసర సమావేశం నిర్వహిస్తుండగా జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోవల్ తో సహా ఇతర ఉన్నత అధికారులతో రాజ్‌నాధ్ సింగ్ సమావేశమయ్యారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిని చర్చిస్తున్నారు. భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొనడంతో పఠాన్‌కోట్, శ్రీనగర్‌ మీదుగా పౌర విమానాల రాకపోకల్ని నిలిపేవేశారు. లెహ్, శ్రీనగర్, అమృత్ సర్ ఎయిర్ పోర్టులో హై అలెర్ట్ ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories