టిక్‌టాక్‌లో కేసీఆర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు..యువకుడి అరెస్ట్‌

టిక్‌టాక్‌లో కేసీఆర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు..యువకుడి అరెస్ట్‌
x
Highlights

సోషల్ మీడియాలో (టిక్ టాక్) యాప్ ద్వారా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును దూషిస్తూ టిక్ టాక్ లో వీడియో తీసి చివరకు ఓ యువకుడు ఇబ్బందుల్లో...

సోషల్ మీడియాలో (టిక్ టాక్) యాప్ ద్వారా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును దూషిస్తూ టిక్ టాక్ లో వీడియో తీసి చివరకు ఓ యువకుడు ఇబ్బందుల్లో పడ్డాడు. కేసీఆర్ ను దూషిస్తూ ఓ వీడియో చేసిన యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే కిద్దిరోజుల క్రితం ఓ యువకుడు (నవీన్) టిక్‌టాక్‌ లో సీఎం కేసీఆర్‌ గురించి అసభ్యకరంగా తిడుతూ వీడియోను చిత్రీకరించి దాన్ని కాస్తా సోషల్ మీడియాలో పెట్టాడు ఇక అదికాస్తా వైరల్ గా మారింది. దీనిపై టీఆర్ఎస్‌వీ(తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహ్మగౌడ్ రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై రాచకొండ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సదరు యువకుడిపై కేసునమోదు చేసిన రాచకొండపోలీసులు అతడిని నేడు అరెస్టు చేశారు.

సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన మ్యూజిక్ యాప్ 'టిక్ టాక్'ఈ యాప్ విడుదలైన అతి కొద్దికాలంలోనే బాగా పాపులారిటీని సంపాదించుకుంది. కాగా తాజాగా గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్ మాయమైంది. టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు చైనీస్ వీడియో షేరింగ్ యాప్ మాయమైన విషయం తెలసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories